Crime News: రైలు పట్టాలపై పడుకోబెట్టి.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య..
వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోవడమే కాదు.. హత్యలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ కూలిపనులకు వెళ్లాడు.
తిరిగి రాకపోవడంత అతని భార్య వరలక్ష్మి మాధవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నారాయణ భార్యపై అనుమానంతో పోలీసులు ఆమె ఫోన్ కాల్స్ వివరాలు చేక్ చేశారు.

ఫోన్ కాల్స్ అనుమానాస్పందంగా ఉండడంతో వరలక్ష్మిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె జరిగింది చెప్పింది. నారాయణ రోజూ మద్యం తాగి వచ్చి తనను కొట్టేవాడని తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధించేవాడని పేర్కొంది.
ఈ క్రమంలో ఆమెకు సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్నగోవిందుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి మధ్య వివాహేతర సంబంధం కొద్ది రోజులు సాగింది. అయితే వరలక్ష్మికి నారాయణ పెట్టే హింసలు పెరిగిపోవడంతో తట్టుకోలేకపోయింది.
చిన్నగోవింద్ తో కలిసి భర్తను హత్య చేయాలని వరలక్ష్మి నిర్ణయించుకుంది. దాని కోసం వరలక్ష్మి, గోవింద్ ఓ ప్రణాళిక రూపొందించారు. ప్లాన్ ప్రకారం నారాయణను గోవింద్ కర్నూలుకు తీసుకెళ్లి పూటుగా మద్యం తాగించాడు. నిలవలేని స్థితిలో ఉన్న అతన్ని రైలుపట్టాలపైకి తీసుకెళ్లాడు.
రైలు పట్టాలపై పడుకోబెట్టాడు. అప్పుడు నారాయణ పై నుంచి రైలు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.నారాయణ చనిపోయిన విషయాన్ని చిన్నగోవింద్ వరలక్ష్మికి ఫోన్ చేసి తెలిపాడు. పోలీసులు వరలక్ష్మి, నారాయణను అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచారు.












Click it and Unblock the Notifications