నోట్లో గుడ్డలు కుక్కి నిద్రిస్తున్న మహిళపై గ్యాంగ్‌రేప్: ఈడ్చుకొచ్చి ఇంటిముందు పడేశారు

Subscribe to Oneindia Telugu

ర్నూలు: జిల్లాలోని అలహర్విలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వివాహిత మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నోట్లో గుడ్డలు కుక్కిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఆ తర్వాత ఆమెను ఇంటిముందుకు ఈడ్చుకొచ్చి పడేసి పారిపోయారు. గమనించిన బంధువులు ఆమెను అదోనిలోని ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ నిర్భయ తరహాలో ఈ దారుణం చోటు చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

కాగా, ఆమె రూ. 50వేలు అప్పు తీసుకుందని, ఆ అప్పు తీర్చని కారణంగానే దుండగులు అత్యాచారానికి పాల్పడి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

A woman allegedly gangraped in Kurnool district

ట్రాక్టర్‌ కిందపడి యువకుడి మృతి

పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన బొగ్గుల చిన్న ఈరన్న(32) ట్రాక్టర్‌ కింద పడి దుర్మరణం చెందినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ జగదీష్‌ శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అలియాస్‌ సిద్ధప్ప అనే డ్రైవర్‌ ట్రాక్టర్‌ను అతి వేగంగా నడపడం వల్ల బోల్తాపడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న చిన్న ఈరన్న ఘటనాస్థలంలో మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman allegedly gangraped in Kurnool district on Friday.
Please Wait while comments are loading...