మహిళా కాంగ్రెస్ నేత ఆత్మహత్య: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సరళ మరికల్ సర్పంచ్‌గా పనిచేశారు. సరళ భర్త రాములు కూడా మరికల్ సర్పంచ్‌గా పనిచేశారు. ఐదేళ్ల క్రితం రాములు మహబూబ్‌నగర్ వద్ద ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు.
కాగా, ఇప్పుడు సరళ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పలువురు కాంగ్రెస్ నేతలు సరళ మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఆర్టీసీ బస్సు-బొలేరో ఢీ: ఆరుగురు మృతి
ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం బండిరేవు శివారున జగదల్‌పూర్-విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరొకరు తీవ్రగాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు.
భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్ వెళ్తున్న బొలేరో మహేంద్ర మ్యాక్సీ వాహనం, కుంట నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ వాహనాన్ని వేగంగా ఎదురుగా వెళ్లి ఢీ కొట్టింది. బొలేరొలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల్లో డ్రైవర్ గజనన్ బాద్రే, మహేశ్‌బాద్రే, సంతోశ్, లక్ష్మీనాధ్‌బాద్రే, కరీనా, మహాదేవితో పాటు గాయపడ్డ వ్యక్తి పేరు జగన్ వశీకర్ అని తెలుస్తోంది.
తీవ్రగాయాలతో కొన ఊపిరితో ఉన్న మరో క్షతగాత్రుడుని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బొలేరో వాహనం అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మృతులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కేర్లాపాల్‌కు చెందిన వారుగా తెలుస్తోంది.
భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, భద్రాచలం రూరల్, చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ఎస్సైలు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగ్రాతుడ్ని ఏరియా ఆసుపత్రికి తరలించడంతో పాటుగా, మృతదేహాలను ప్రత్యేక వాహనంలో భద్రాచలం ఆసుపత్రి మార్చురీకి పంపించారు. ఆర్టీసీ బస్సును, బొలేరో వాహనాన్ని తొలగించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications