తిరుమలలో అనూహ్యం: జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడ్డ భక్తురాలు! ఉద్దేశపూరకమే!
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారుకు ఓ మహిళా భక్తురాలు ఉద్దేశపూరకంగా అడ్డొచ్చారు. కారుకు అడ్డు పడ్డారు. దీనితో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. పద్మావతి అతిథి గృహం నుంచి వైఎస్ జగన్ కాన్వాయ్ బయలుదేరిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనితో కలకలం చెలరేగింది.
ఏడుకొండల వాడిని దర్శించుకున్న తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. పద్మావతి అతిథిగృహం నుంచి ఆయన కాన్వాయ్ తిరుపతి వైపు వెళ్తుండగా.. మార్గమధ్యలో ఓ మహిళా భక్తురాలు హఠాత్తుగా వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారుకు అడ్డుపడ్డారు. దీనితో డ్రైవర్ కారును సడన్‌గా ఆపారు. డ్రైవర్ పక్కసీటులో కూర్చున్న వైఎస్ జగన్ కిందికి దిగారు. ఆ మహిళను పలకరించారు. దెబ్బలు తగిలాయా? అంటూ అడిగారు.

దీనితో ఆమె కన్నీటిపర్యంతం అయ్యారు. తన నిరుద్యోగి అని, ఆయనకు ఉద్యోగం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీయగా.. తాను అమలాపురం నుంచి వచ్చానని ఆమె తెలిపారు. ఆమె వివరాలను తీసుకోవాలని తన వ్యక్తిగత కార్యదర్శికి సూచించారు. అర్హతలను బట్టి ఉద్యోగం దక్కేలా ఏర్పాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications