మహిళ హత్య: బెంగళూర్ ఏటిఎం దాడి నిందితుడేనా?

కాగా లలిత హత్యకు పాల్పడిన నిందితుడు, కర్ణాటకలోని బెంగళూరు ఏటిఎంలో మహిళపై దాడికి పాల్పడిన వ్యక్తి , ధర్మవరంలో ప్రమీలమ్మ అనే వృద్ధురాలి హత్యకు పాల్పడింది ఒక్కరేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు నుంచి వచ్చిన పోలీసుల ప్రత్యేక బృందం గుట్టూరులో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితుడు హత్యకు పాల్పడిన లలిత మృతదేహాన్ని కూడా పోలీసులు పరిశీలించారు.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఓ ఏటిఎం కేంద్రంలో బ్యాంకు ఉద్యోగి జ్యోతి ఉదయ్ డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో ఓ దుండగుడు ఆమెపై దాడికి దిగాడు. కత్తితో దాడి చేసిన దుండగుడు ఆమె వద్ద ఉన్న రూ. 2,500లను, ఆమె మొబైల్ ఫోన్‌ను అపహరించుకుపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఏటిఎం గదిలోనే ఉంచి షటర్ మూసివేసి దుండగుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఏటిఎం నుంచి రక్తం బయటికి రావడాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటోంది. కాగా బెంగళూరు ఏటిఎంలో మహిళపై దాడి చేసిన వ్యక్తి, అనంతపురం ధర్మవరంలో ఓ వృద్ధురాలి హత్యకు పాల్పడిన వ్యక్తి, శుక్రవారం ఉదయం పెనుకొండ మండలం గుట్టూరులో ఆశా వర్కర్ హత్య పాల్పడిన వ్యక్తి ఒక్కరేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుని కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications