చందా ఇవ్వలేదని గర్భిణిపై యువకుడు దాడి: అరెస్ట్

సికింద్రాబాద్: వినాయకుని చందా ఇవ్వలేదని ఓ గర్బిణీపై దాడి చేసిన యువకుడిని అరెస్టు చేశారు. తుకారాంగేట్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్ మారేడ్‌పల్లిలో జయప్రకాశ్‌నగర్ ప్రాంతంలో పన్నలాల్, తారాదేవి (23) దంపతులు నివాసం ఉంటున్నారు. తారాదేవి ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణీ.

పన్నాలాల్ వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లడంతో ఇంట్లో తారాదేవి ఒక్కతే ఉంది. సెప్టెంబర్ 1న వినోద్ (26) అనే యువకుడు గణేష్ చందాకోసం పన్నాలాల్ ఇంటికి వెళ్లాడు. కాలింగ్ బెల్ కొట్టగా ఇంట్లో ఉన్న తారాదేవి తలుపులు తీసింది. జయప్రకాశ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడికి చందా ఇవ్వాలని అడిగాడు.

A youth allegedly attacked on pregnant woman

తన భర్త లేడని రేపువచ్చి తీసుకోండని ఆమె తెలిపింది. ఇప్పుడే ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమె ఎంత చెప్పినా వినకుండా వాగ్వివాదానికి దిగాడు. ఒక్కసారిగా ఆమె చెయ్యి పట్టుకున్న వినోద్‌ను ఆమె ప్రతిఘటించింది. దీంతో వినోద్ ఆమె కడుపుపై తన్ని పరారయ్యాడు. తారాదేవికి కడుపు నొప్పి మొదలైంది.

భర్త ఇంటికి రాగానే జరిగిన విషయం తెలపడంతో రెజిమెంటల్ బజార్‌లోని ఓ అస్పత్రికి చికిత్స నిమిత్తం చేర్పించాడు. గురువారం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో వినోద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమె గర్భానికి ఎలాంటి హాని జరగలేదని, మూత్రాశయానికి వచ్చిన సమస్యకు చికిత్స చేస్తున్నామని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+