యువకుడు ఆత్మహత్య: రోకలిబండతో మోది ప్రియురాలి హత్య

హైదరాబాద్/మహబూబ్‌నగర్: జిల్లాలోని వీపనగండ్ల మండలం బెక్కెంలో దారుణం జరిగింది. ప్రేమించిన ప్రియుడే ఓ యువతికి కాలయముడయ్యాడు. ప్రియురాలిని రోకలిబండతో మోది దారుణంగా హత్య చేశాడు. ప్రియురాలిని చంపిన అనంతరం ప్రేమికుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో యువతి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

A youth allegedly murdered his girl friend

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మల్కాజిగిరి ఎస్ఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మల్లిఖార్జునగర్‌లో నివసించే ఎ. ఉదయ్‌కుమార్(21) బీకాం చివరి సంవత్సరం చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాడు. కొద్ది రోజుల క్రితం సోదరి ఆత్మహత్య చేసుకుంది.

కాగా, ఉదయ్ కుమార్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె అతని ప్రేమను తిరస్కరించింది. సోమవారం మధ్యాహ్నం తన గదికి చేరుకున్న ఉదయ్ సెల్‌ఫోన్ ద్వారా సందేశాన్ని స్నేహితుడికి పంపి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమలో విఫలం కావడం వల్లనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఓ లేఖ రాశాడు. అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు.

విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతి

మెదక్: విద్యుదాఘాతంతో తండ్రీకొడుకులు మృతిచెందారు. పొలానికి నీరు పెడుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన మెదక్‌లోని కొచెరువుతండాలో చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+