ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..?
చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీలో ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి.ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3,500 వేల కోట్లు రావాల్సి ఉందని,పాత బకాయిల కోసం 10 నెలల్లో 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశామని.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్లు రావాల్సి ఉందని ..ఆస్పత్రుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇక మీదట ఉచిత వైద్య సేవలు అందజేయలేమని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ సేవ వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని సభ్యులు తెలిపారు.ఇప్పటి నుంచి EHS, OP సేవలను మాత్రమే బంద్ చేస్తున్నట్లు తెలిపారు. చర్చలు సఫలం కాకపోతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అసోసియేషన్ సభ్యులతో చర్చలు జరిపేందుకు అధికారులు రెడీ అవుతోన్నట్లు తెలిసింది. పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. పెండింగ్ బకాయిలు చెల్లించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications