ఏపీకి ఇవిచ్చాం: 'లెక్క' చెప్పిన వెంకయ్య, బాబుకు భయంలేదని జగన్‌కు కౌంటర్
న్యూఢిల్లీ: ఏపీకి కేంద్రం ప్రకటడించిన ప్యాకేజీ విలవ రూ.2.29 లక్షలు అని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు గురువారం నాడు తెలిపారు. ఈ మెరకు ఆయన లెక్కలతో సహా వివరాలు వెల్లడించారు.
గందరగోళమొద్దు: పవన్ సభ, కాకినాడలో ఆంక్షలు, ప్యాకేజీపై ఎలా.
వెంకయ్య చెప్పిన లెక్కలు ఇలా ఉన్నాయి. పెట్రోలియం ప్రాజెక్టులు రూ.52,120 కోట్లు, జాతీయ రహదారులకు రూ.65,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టు రూ.15,850 కోట్లు, విద్యా సంస్థలకు రూ.5,190 కోట్లు, జాతీయ సంస్థలకు రూ.1,030 కోట్లు, రక్షణ సంస్థలకు రూ.6,266 కోట్లు, పట్టణాభివృద్ది, గృహ నిర్మాణం రూ.4,110 కోట్లు, నౌకాయాన ప్రాజెక్టులు రూ.3,465 కోట్లు.
ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు రూ.1,740 కోట్లు, విద్యుత్ ప్రాజెక్టులకు రూ.328 కోట్లు, ఎయిర్ పోర్టులకు రూ.303 కోట్లు, రైల్వే ప్రాజెక్టులకు రూ.3,808 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమలకు రూ.3,078 కోట్లు, ఐటీ, టెలీ కమ్యూనికేషన్లకు రూ.357 కోట్లు, పర్యాటక రంగానికి రూ.131 కోట్లు, ఇతరత్రా రూ.102 కోట్లు. ఇలా మొత్తం రూ.1,62,878 కోట్లు. ఇవన్నీ ఇప్పటిదాకా చేపట్టిన పనులకు సంబంధించిన కేటాయింపులు.

కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు ఇలా ఉన్నాయి. ఆర్ఐఎన్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.38,500 కోట్లు, విశాఖలో మెడ్ టెక్ పార్కుకు రూ.20,000 కోట్లు, అమరావతి నిర్మాణానికి హడ్కో రుణం రూ.7,500 కోట్లు, ఏపీ ట్రాన్స్ మిషన్ కారిడార్ నిర్మాణానికి రూ.520 కోట్లు. ఇలా మొత్తం.. రూ.66,520 కోట్లు. ఇప్పటిదాకా చేపట్టిన ప్రాజెక్టులకు 1,62,878 కోట్లు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులకు ఇవ్వనున్న రూ.66,520 కోట్లు మొత్తం కలుపుకుని రూ.2,29,398 కోట్లని వెంకయ్య చెప్పారు.
చంద్రబాబును నేను సమర్థిస్తున్నా
జైట్లీ బుధవారం చేసిన ప్రకటనకు చట్టబద్ధత కల్పించాలన్న ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తిని నేను సమర్థిస్తున్నానని వెంకయ్య చెప్పారు. రాష్ట్రాలకు హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆర్థికలోటు ఉన్న రాష్ట్రాలకు సాయం చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయడంతో ఏపీకి ఏవిధంగా న్యాయం చేయాలని ఆర్థికమంత్రి జైట్లీ ఎంతో కసరత్తు చేసి ప్రత్యేక హోదా సందిగ్ధతకు తెర దించారన్నారు.
బాబు భయపడటం ఏమిటి
చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నాడని చెప్పడంలో అర్థం లేదని వెంకయ్య నాయుడు అన్నారు. చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి వెంకయ్య కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. దీనిపై పరోక్షంగా వెంకయ్య స్పందించారు.
చంద్రబాబు హోదాను విపక్షాలు కోరుకుంటున్నాయని, అందుకే రాజీనామా చేయమంటున్నారని కౌంటర్ ఇచ్చారు. అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలని భావించే అన్ని జిల్లాలకు అన్నీ కేటాయిస్తున్నామన్నారు. నియోజకవర్గాలను పెంచడానికి సూత్రప్రాయంగా కేంద్రం ఆంగీకారం ఉందన్నారు. తనను ఏపీలో అడుగుపెట్టనివ్వబోమని, పంచె ఊడదీసి కొడతాం అంటున్నారని, అసలు అలాంటి అసభ్య పదజాలం ఎందుకు ఉపయోగిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తనని మోసగాడని కొందరు ఆరోపించడం బాధగా ఉందన్నారు.
హోదాను అప్పుడే పొందుపర్చలేదేం
అసలు హోదా అంశాన్ని చట్టంలో అప్పుడే పొందుపరచాలన్న జ్ఞానం అప్పుడు ఏమయిందని వెంకయ్య విమర్శించారు. హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఐఐటీ(తిరుపతి), ఐఐఎం(విశాఖ), ఐసెర్ (తిరుపతి), ఐఐఐటీ (చిత్తూరు), ఎన్‌ఐటీ (తాడేపల్లిగూడెం), ఎన్‌ఐఓటీ(నెల్లూరు), ఎయిమ్స్ (మంగళగిరి), వ్యవసాయ విశ్వ విద్యాలయం (గుంటూరు), నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్(అనంతపురం), కామధేను బ్రీడింగ్ సెంటర్ (నెల్లూరు), దూరదర్శన్, ఆకాశవాణి కేంద్రాలు విజయవాడలో ఏర్పాటు, రీజినల్ పాస్‌పోర్టు సేవాకేంద్రం(విజయవాద), హెచ్‌పీసీఎల్ విస్తరణ, ఎస్‌పీఏను వేగవంతం చేయడం, సమీర్ శంకుస్థాపన, బకింగ్‌హం కెనాల్ ద్వారా జలరవాణాకు ఏర్పాట్లు, దుగరాజపట్నం పోర్టుకి భూసేకరణ ఇలా అనేకం ఏపీకి ఇచ్చామన్నారు. పదేళ్లలో చేయాలని చట్టంలో పేర్కొన్నారని కొన్ని అసలు చట్టంలోనే లేవన్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలు అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications