ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పై కీలక అప్డేట్..!!

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) బెయిల్ పిటీషన్ పైన ఏసీబీ కోర్టులో కీలక వాదనలు చోటు చేసుకున్నాయి. బెయిల్ పిటీషన్(Bail Petition) తో పాటుగా సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటీషన్లలో పైన ఏది తొలుత విచారణ చేయాలనే అంశం పైన సీఐడీ(CID) - చంద్రబాబు తరపు న్యాయవాదులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. ఇద్దరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మంగళవారం ఈ రెండు పిటీషన్లలో ఏది ముందు విచారించాలో నిర్ణయిస్తామని వెల్లడించారు.

ఏసీబీ కోర్టులో విచారణ: ఏసీబీ కోర్టులో ఈ రోజు చంద్రబాబు(Chandra Babu) బెయిల్ పిటీషన్ పైన ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగుతోంది. అటు సుప్రీం కోర్టు(Supreme Court)లో స్కిల్ కేసులో క్వాష్ దాఖలు చేసిన చంద్రబాబు తరపు న్యాయవాది లూధ్రా చీఫ్ జస్టిస్ బెంచ్ వద్ద ఈ పిటీషన్ అంశాన్ని మెన్షన్ చేసారు. చంద్రబాబు చాలా రోజులుగా రిమాండ్ లో ఉన్నారని..విచారణ చేయాలని కోరారు. ఎన్ని రోజులుగా చంద్రబాబు రిమాండ్ లో ఉన్నారని సీజే ప్రశ్నించారు.

ACB Court posted Chandra Babu bail and CID Custody petitions hearing for 26th September

రేపు (మంగళవారం) మెన్షన్ చేస్తే చర్చించి..ఎప్పుడు విచారణ చేయాలో నిర్ణయం తీసుకుందామని సీజే చెప్పారు. సుప్రీంలో దాఖలు చేసిన ఎస్ఎల్పీలో ఏపీ ప్రభుత్వం(AP Govt), ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం ను ప్రతివాదులుగా చేర్చారు. రేపు సుప్రీం సీజే ఈ పిటీషన్ విచారణ ఎప్పుడనేది నిర్ణయించనున్నారు.

రేపటికి వాయిదా: ఇటు ఏసీబీ కోర్టులో కస్టడీ పిటీషన్ లో వాదనలకు న్యాయవాదులు సిద్దమయ్యారు. ముందుగా బెయిల్ పైన విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పట్టుబట్టారు. అయితే, కస్టడీ పిటీషన్ పెండింగ్ లో ఉండగా బెయిల్ పైన విచారణ సరికాదని సీఐడీ(CID) తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఏ విచారణ చేయాలో పట్టుబట్టటంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసారు. చంద్రబాబును న్యాయమూర్తి శని, ఆది వారాల్లో రాజమండ్రి(Rajahmundry) జైలులోనే విచారణకు అనుమతించారు.

తాము అయిదు రోజులు కోరితే రెండు రోజులే అవకాశం ఇచ్చారని..మరిం సమాచారం రాబట్టాల్సి ఉందని సీఐడీ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. పోలీస్ కస్టడీ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు(Chandra Babu) తరుపు న్యాయవాదులకు న్యాయస్థానం సూచించింది. కౌంటర్ దాఖలు చేస్తామని చంద్రబాబు తరుపు న్యాయవాదులు చెప్పారు.

కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ: కస్టడీ పిటిషన్ పై వాదనలు వినాలా, బెయిల్ పై వాదనలు వినాలో రేపు నిర్ణయం తీసుకుంటానన్న న్యాయమూర్తి..తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసారు. రేపు (మంగళవారం) ఏసీబీ కోర్టు(ACB Court)లో బెయిల్ పిటీషన్ తో పాటుగా కస్టడీ పిటీషన్ విచారణ జరిగే అవకాశం ఉంది.

అయితే, అటు సుప్రీం కోర్టులో సీజేఐ బెంచ్ చంద్రబాబు(Chandra Babu) దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణ పైన నిర్ణయం తీసుకోనుంది. ఇట చంద్రబాబు రిమాండ్ వచ్చే నెల 5వ తేదీ వరకు ఉండటంతో కస్టడీ పైన ఏసీబీ కోర్టు ఏం చెప్పబోతోంది..అదే సమయంలో బెయిల్ పైన ఏ నిర్ణయం ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+