తవ్వేకొద్ది.. ఆ డీటీవో మోహన్ ఆస్తులు రూ.800 కోట్ల పైనే!

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డిటిఓ) ఆదిమూలం మోహన్ రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఆయన అవినీతి దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని తేలినట్లుగా తెలుస్తోంది. ఆయన ఆస్తుల పైన ఇటీవల ఏసీబీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ దాడుల్లో మోహన్ ఆస్తులు తొలుత రూ.350 కోట్లు, ఆ తర్వాత రూ.500 కోట్లు, ఆ తర్వాత రూ.800 కోట్లుగా తేలిందని తెలుస్తోంది. తాజాగా ఆస్తుల విలువ రూ.1000 కోట్లు ఉంటుందని తేలిందని తెలుస్తోంది.

కాగా, మోహన్‌ను అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ఏసీపి విచారణాధికారి టీమ్ డీఎస్పీ రమాదేవి మాట్లాడుతూ... మోహన్ ఆస్తుల పైన విచారణ కొనసాగుతోందని తెలిపారు. మరో నాలుగు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ... ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని చెప్పారు.

 ACB court sends Rs 800 crore babu to remand

తవ్వేకొద్దీ ఆస్తులు

మోహన్‌ అక్రమార్జన తవ్వేకొద్దీ బయటపడుతోంది. బినామీలతో కంపెనీలు పెట్టించి, అవినీతి సొమ్మునంతా వాటిలోకి మళ్లించిన వైనం అందర్నీ నివ్వెరపరుస్తోంది. గురువారం తనిఖీలు మొదలయినప్పుడు రూ. 350 కోట్ల విలువైన (మార్కెట్‌ ధర) సంపద ఆదాయ లెక్కకు రావడం లేదని గుర్తించిన అధికారులు.. తనిఖీలు తీవ్రమయినకొద్దీ రూ. 500 కోట్లు, రూ. 800 కోట్లు, రూ. 1,000 కోట్లుగా.. అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా మోహన్‌కు బినామీగా భావిస్తున్న మల్లికార్జున గౌడ్‌ అరెస్ట్‌తో అక్రమాస్తుల డొంక మరింత కదలవచ్చునని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మల్లికార్జున గౌడ్‌.. మూడు రాష్ట్రాల పరిధిలో మోహన్‌ ఆస్తులను చక్కబెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

అనంతపురం, ప్రకాశం, హైదరాబాద్‌, నెల్లూరు ఇలా ఎక్కడ పనిచేస్తే అక్కడ మోహన్‌.. బినామీలనుసృష్టించినట్టు తెలుస్తోంది. భార్య స్వస్థలం బళ్లారిలో పెద్ద ఎత్తున ఆస్తులు కొన్నట్టు, కుమార్తెలు సాయిశ్రీ, సాయితేజ పేరిట బోగస్‌ కంపెనీలను పెట్టినట్టు చెబుతున్నారు.

మోహన్‌ ఆస్తులపై నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ తనిఖీల వార్తలతో, ఆయన బాధితులు మౌనం వీడుతున్నారు. రెండు రోజులుగా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బినామీల పేర్లతో కంపెనీలు పెట్టడం, నమ్మకస్థుల పేరుతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు ఇప్పటిదాకా ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. పలు వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

సమాచారం మేరకు... హైదరాబాద్‌లోని మాదాపూర్‌, కోంపల్లి, జూబ్లీహిల్స్‌, గుట్ల బేగంపేటలో ఇంటి స్థలాలు. జూబ్లీహిల్స్‌లో సొంత ఇల్లు. పంజాగుట్టలో 200 గజాల కాంప్లెక్స్‌, అపార్టుమెంట్‌. బళ్లారిలో ప్రైవేటు స్కూలుపై పెట్టుబడులు. కరీంనగర్, ఆదోని, కడప, అనంతపురంలోని గ్రానైట్‌ కంపెనీల్లో షేర్లు.

రాజమండ్రిలోని శ్రీతేజ బయోఫ్యూయల్స్‌ స్పిరిట్‌ ఫ్యాక్టరీలో ప్రధాన వాటాకర్ణాటకలో ఆర్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌లో పెట్టుబడులు. బెంగళూరు మైసూరు రోడ్డు వద్ద కంకర క్వారీ, 24 ఎకరాల భూమి. నెల్లూరులో ఉషోదయ ఎంటర్‌ ఫ్రైజెస్‌ పేరుతో కోల్‌, బ్రోకెన్‌రైస్‌ రవాణా వ్యాపారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+