ఎసిబి సోదాలు: ఆమె ఆక్రమాస్తుల విలువ కోటికి పైగానే..
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న భారతి ఇంటిపై బుధవారం అవినీతికి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాదుల్లోని ఆమె బంధువుల నివాసాలపై కూడా ఎసిబి అధికారులు ఏక కాలంలో విధులు నిర్వహించారు.
వారి నివాసాల్లో ఎసిబి అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే బంగారం, వెండి ఆభరణాలతో పాటు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారతికి ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఎసిబి అధికారులు ఈ దాడులు నిర్వహించారు.

ఇదిలావుంటే, ప్రకాశం జిల్లాలో మహిళపై మత్తు మందు చల్లి దోపిడీదొంగలు భారీగా సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన దర్శి మండల కేందర్ంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక అద్దంకి రోడ్డులో నివసిస్తున్న శీలం పద్మ అనే మహిళ మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది.
ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై మత్తు మందు చల్లి 8 తులాల బంగారం, అర కిలో వెండి సామాన్లతో పాటు రూ. 3వేల నగదును దోచుకెళ్లారు. దీనిపై ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications