అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారుల్ని గ్రిప్‌లో: కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కళ్లు చెదిరే ఆస్తులు, హైదరాబాద్ రెండో భార్య ఇంట్లో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ లక్ష్మీ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ బుధవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 20 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

హైదరాబాదులో మరో దారుణం: బండరాయితో మోది బీటెక్ విద్యార్థిని అనూష హత్యహైదరాబాదులో మరో దారుణం: బండరాయితో మోది బీటెక్ విద్యార్థిని అనూష హత్య

విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర నగరాల్లో సోదాలు చేశారు. ఒక్క హైదరాబాదులోనే ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

 ఉన్నతాధికారులను గ్రిప్‌లో పెట్టుకొని కథ నడిపాడు

ఉన్నతాధికారులను గ్రిప్‌లో పెట్టుకొని కథ నడిపాడు

లక్ష్మీప్రసాద్ 1987లో వాణిజ్య సాఖలో ేరారు. 2006 నుంచి 2011 వరకు కమిషనర్ కార్యాలయంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే అతను భారీగా అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారులను కూడా తన గ్రిప్‌లో పెట్టుకొని, కథ నడిపాడని తెలుస్తోంది. యనమల వద్ద కొంతకాలం పాటు ఓఎస్డీగా పని చేశారు.

 హైదరాబాదులోని రెండో భార్య ఇంట్లో

హైదరాబాదులోని రెండో భార్య ఇంట్లో

హైదరాబాదులోని అశోక్ నగర్‌లో ఆయన రెండో భార్య ఉంటున్నారు. ఇక్కడ కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.10 కోట్ల ఆస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలో 2 వేల గజాల స్థలం, శంషాబాద్‌లో రెండు ఎకరాల భూమి, పరిగిలో 4 ఫ్లాట్స్, రెండు కార్లు, అశోక్ నగర్‌లో మూడు డబుల్ బెడ్ రూం ప్లాట్స్ గుర్తించారని తెలుస్తోంది. వీటితో పాటు బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో నగదు, విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు.

పెద్ద ఎత్తున సోదాలు

పెద్ద ఎత్తున సోదాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీప్రసాద్ ఆస్తులు చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాలపై బుధవారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగాయి. విశాఖలో మూడుచోట్ల, విజయవాడలోని ఆయన ఇంటితో పాటు మరో రెండు చోట్ల, గుంటూరులో మూడు చోట్ల, శ్రీకాకుళంలో మూడు చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో బంధువుల ఇళ్లు కూడా ఉన్నాయి.

 కొంతకాలంగా లక్ష్మీప్రసాద్, భార్యలకు అనారోగ్యం

కొంతకాలంగా లక్ష్మీప్రసాద్, భార్యలకు అనారోగ్యం

లక్ష్మీప్రసాద్‌తో పాటు ఆయన భార్య కూడా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. లక్ష్మీప్రసాద్‌కు క్యాన్సర్ ఉంది. ఈయన అనారోగ్యం కారణంగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేషీ నుంచి తప్పుకున్నారు. ఆయన భార్య కోమాలో ఉంది. ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు.

English summary
ACB raids on former commercial tax officer Laxmi Prasad residence on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X