శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోట్లకు పడగలెత్తిన ఐటీడీఏ పీవో: 4జిల్లాల్లో ఏసీబీ దాడులు

|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: సీతంపేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి జల్లేపల్లి వెంకటరావుకు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో మంగళవారం అవినీతినిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీతంపేటలోని పీవో బంగ్లాతోపాటు, శ్రీకాకుళం, ఆమదాలవలస, రాజాం, పాలకొండ, విశాఖపట్నంలో పివో బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డి.ఎస్పీ రంగరాజు తెలిపారు.

సీతంపేట, పాత శ్రీకాకుళం, రాజాం, ఆమదాలవలస పట్టణం,విశాఖపట్నం సీతమ్మధార ప్రాంతంలో ఒక ఫ్లాటు..ఆరిలోవలో ఒక ఇల్లు..మధురవాడలో ఒక ప్లాటు..జిల్లాలో ఆమదాలవలసలో ఒక ఇల్లు.. శ్రీకాకుళం, రాజాంలలో రెండేసి ప్లాట్లుఓ హోండా సిటీ కారు171 గ్రాముల బంగారం, రూ. 28 వేల విలువ చేసే వెండిఓ హోండా సిటీ కారుశ్రీకాకుళం, విశాఖపట్నంలలోని బ్యాంకుల్లో రెండు లాకర్లుఈ ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 1.70 కోట్లుమార్కెట్‌ విలువ ప్రకారం సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని అంచనా.

సీతంపేటలోని ఆయన కార్యాలయం, అధికార నివాసం, ఆమదాలవలసలోని తల్లిదండ్రులు, అన్నదమ్ముల ఇళ్లలో, ఎచ్చెర్ల మండలంలో అల్లినగరంలోని మామయ్య నివాసంలో, శ్రీకాకుళంలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న ఆయన సోదరి నివాసంలో, విశాఖపట్నంలో ఒక బంధువు, ఒక బినామీ ఇంట్లో, రాజాంలో బంధువు ఇళ్లలో, పాలకొండలో కార్యాలయ సిబ్బంది ఇళ్లలో ఒకేసారి మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభించారు. బంగ్లాలో, ఐటీడీఏ కార్యాలయానికి పీవో వెంకటరావుని తీసుకువచ్చి విచారించారు.

ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలను ఏసీబీ డీఎస్పీ రంగరాజు వెల్లడించారు. వెంకటరావును అరెస్టు చేసి కోర్టుకు తరలించేది లేనిదీ బుధవారం నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. సోదాల్లో శ్రీకాకుళం సహా విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరుల నుంచి సీఐలు శ్రీనివాసరావు, లక్ష్మోజి, సి.రమేష్‌, రమేష్‌, మోహనరావు, విల్సన్‌, రాజశేఖర్‌, గణేష్‌, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. సీతంపేట ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న వెంకటరావు అంచెలంచెలుగా ఎదిగారు. తొలుత ఉప తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరారు. జిల్లాలో రాజాం, పాతపట్నం, వంగర, టెక్కలి మండలాల్లో తహసీల్దార్‌గా, కలెక్టరేట్‌ ఏవోగానూ, విజయనగరం, పార్వతీపురంలలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు.

ACB Raids on Sitampeta ITDA PO Venkat Rao Houses in four districts.

మంగళవారం వేకువజాము 5 గంటలు.. జీపులో కొంత మంది అధికారులు వచ్చారు. వారెవరో స్థానికులకు అర్థం కాలేదు. వచ్చిన వెంటనే రాజాంలోని రోడ్లు భవనాలశాఖ అతిథి గృహం ఎదుట కాలనీలో ఒక పైఅంతస్తు ఇంటికి వెళ్లారు. తాళం వేసి ఉండడంతో కిందకు వచ్చేశారు. ఇంట్లోని వ్యక్తుల గురించి ఆరా తీయడంతో అప్పుడు తెలిసింది వచ్చిన వారు ఏసీబీ అధికారులని!

ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు సమీప బంధువుల ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన అవినీతి నిరోధక శాఖ అధికారుల బృందం ఈ సోదాల్లో పాల్గొంది. ఏసీబీ సీఐ సూర్యమోహన్‌రావు ఆధ్వర్యంలోని బృందం సోదాల్లో పాల్గొంది. ఐటీడీఏ పీవో తోడల్లుడు, రాజాం మండలం పొగిరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చదువుల భాస్కరరావు ఇంట్లో మొదట సోదాలు చేశారు. ఆ సమయంలో భాస్కరరావు ఇంట్లో లేరు. ఆయన భార్య అనసూయకు సోదాల విషయం చెప్పారు. భాస్కరరావుతో ఫోన్లో మాట్లాడించారు. పక్కింటికి చెందిన మరో మహిళను పిలిపించి ఆమె సమక్షంలో సోదాలు చేపట్టారు.

ఇంట్లోని బీరువాలు, కప్‌ బోర్డులు, ఇతరత్రా వాటిలో సోదాలు చేశారు. ఐటీడీఏ పీవో తమ్ముడి మామయ్య సత్యనారాయణ ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గుర్తించారు. వారు విశాఖపట్నం వెళ్లినట్లు నిర్ధరించుకొని వారికి సమాచారం అందించారు. మధ్యాహ్నానికి వారు తాళం తీసుకురావడంతో ఆ ఇంట్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో కొన్ని డాక్యుమెంట్లు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో రెండు డాక్యుమెంట్లు ఐటీడీఏ పీవో వెంకటరావు భార్య మనోరమ పేరు మీద ఉన్నట్లు గుర్తించామని సీఐ సూర్యమోహన్‌రావు తెలిపారు. ఇతరత్రా వాటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఐటీడీఏ డేటా ప్రాసెసింగ్‌ ఆపరేటర్‌ (డీపీవో) వై.సతీష్‌కుమార్‌, ఐటీడీఏ పీవో వెంకటరావు వ్యక్తిగత సహాయకుడు (పీఏ) జి.ప్రకాష్‌ ఇంట్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

గత చరిత్ర అవినీతిమయమే..

ప్రస్తుత ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటరావు రాజాం తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలోనూ కార్యాలయంపై ఏసీబీ దాడి చేసింది. లంచం తీసుకుంటుండగా సీనియర్‌, జూనియర్‌ సహాయకులు పట్టుబడటం అప్పట్లో సంచలనం రేపింది.

కాగా, ఆమదాలవలస పట్టణంలోని ఎనిమిదో వార్డు గేటు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటేశ్వరరావు, సోదరుల నివాసంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.రమేష్‌, డి.రమేష్‌ ఆధ్వర్యంలో ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, ఇతర వివరాలు సేకరించారు.

దాడులపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు మాట్లాడుతూ.. ఐటీడీఏ పీవో జల్లేపల్లి వెంకటేశ్వరరావుపై నమోదైన అక్రమాస్తుల కేసులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు నిర్వహించి, దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుకు చెందిన మరో రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్ారు.

English summary
ACB Raids on Sitampeta ITDA PO Venkat Rao Houses in four districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X