TTD: తిరుమలలో గదులు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కేవలం ఐద నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. లడ్డూకు రూల్స్ పెట్టారు.
తిరుమల/తిరుపతి: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో కేవలం ఐద నుంచి 10 నిమిషాల వ్యవధిలో గదులు పొందుతున్నారని టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల గదుల రొటేషన్ పూర్తిగా తగ్గిందన్నారు. అయితే టీటీడీ నిర్ణయంతో భక్తులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు.

రెండుసార్లు ఒక్కరే ఉండాలి
దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఈ టెక్నాలజీ చక్కగా ఉపయోగపడుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తెలిపారు. సామాన్య భక్తులు ఎవరైతే గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఫేస్ రికగ్నిషన్ చేసుకుంటున్నారో, వారే ఉపవిచారణ కార్యాలయాల్లో గదులు పొంది, ఖాళీ చేసే సమయంలో కూడా నేరుగా వెళ్లి ఖాళీ చేస్తేనే కాషన్ డిపాజిట్ రిఫండ్ చేయడం జరుగుతుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.

నెలకు ఒక్కరికి ఒక్కసారే గదులు
ఒకసారి తమ ఆధార్ కార్డుతో గదులు పొందిన భక్తులు మళ్లీ 30 రోజుల తర్వాతే టీటీడీకి సంబంధించిన గదులు పొందేందుకు అవకాశం ఉంటుందని ఈవో ధర్మారెడ్డి స్పష్టటం చేశారు. మార్చి 1వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు తిరుమలలో గదుల కేటాయింపు ద్వారా అత్యధికంగా రూ.2.95 కోట్ల రాబడి వచ్చిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

సీఆర్ ఓ దగ్గరకు కౌంటర్
అడ్వాన్స్ బుకింగ్, కరెంటు బుకింగ్ లో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వసతి గదుల కోసం పేర్ల నమోదు కౌంటర్లను ప్రయోగాత్మకంగా త్వరలో సీఆర్ఓ వద్దకు మార్చనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 లో భక్తులకు అందించే ఉచిత లడ్డులో కూడా ఫేస్ రికగ్నిషన్ ద్వారా అక్రమాలను అరికట్టినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

క్యూకాంప్లెక్స్ లో లడ్డూలు కావాలంటే ?
ఇక ముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో మనిషి లేకుండా లడ్డూ రాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. అంతకుముందు మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వల్ల భక్తులు పొందుతున్న సౌకర్యాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.
అయితే నెలకు ఒక్కరికి ఒకేసారి తిరుమలలో గదులు కేటాయిస్తామని టీటీడీ స్పష్టం చెయ్యడంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తు్నారు.












Click it and Unblock the Notifications