ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులలో మీకు ఖాతాలుంటే జరిమానా!

ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగాయి. బ్యాంక్ అకౌంట్ ల ద్వారా నేరుగా చెల్లింపులు చేస్తున్న ఈ తరుణంలో ఒక్కొక్కరు లెక్కకు మిక్కిలి బ్యాంక్ అకౌంట్ లను తీసుకుంటున్నారు. అయితే భారతదేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఒకటికంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లను తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఒక వార్త వారందరికీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

బ్యాంకు ఖాతాలపై వైరల్ పోస్ట్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్త వివరాల్లోకి వెళితే "మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్స్ తెరవలేరు.. ఇలా చేస్తే మీకు జరిమానా విధిస్తారు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఇది జరుగుతోంది" అని ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ వైరల్ న్యూస్ చదివిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

Accounts in more than one bank can be fined is this true

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే జరిమానా
అవునా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఆర్బిఐ జరిమానా విధిస్తుందా? అనే ప్రశ్నలతో సతమతమవుతున్నారు. ఈ వైరల్ పోస్ట్ లో ఆర్బీఐ గవర్నర్ శశికాంత్ దాస్ ఫోటో కూడా ఉంది. ఆర్బిఐ లోగో తో ఉన్న ఈ వైరల్ పోస్ట్ హిందీలో రాసి ఉంది. రెండు బ్యాంకుల్లో ఖాతాలు ఉంచితే కఠిన జరిమానా విధిస్తాం అంటూ ఆర్బిఐ గవర్నర్ చెప్పినట్టుగా పోస్ట్ ఉంది.

ఆర్బీఐ అధికారికంగా ధ్రువీకరించిందా?
అయితే ఆర్బిఐ గవర్నర్ దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక ఈ వార్తను ఆర్బిఐ అధికారికంగా ధ్రువీకరించలేదు. బ్యాంకులో ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా ఆర్బిఐ జారీ చేయలేదు. భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకులలో ఖాతాలనైనా కలిగి ఉండవచ్చు.

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వార్తలో నిజం ఇదే
కానీ ఆర్థిక నిపుణుల సూచన మేరకు మూడు లేదా నాలుగు బ్యాంక్ అకౌంట్ల కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటే వాటిని మెయింటైన్ చేయడం కష్టంగా మారుతుంది. ఈ సూచనలు కూడా ఆర్ధిక నిపుణులు ఇస్తున్నవి. ఇంతకు మినహాయించి ఆర్బిఐ నుంచి బ్యాంకు ఖాతాలపై ఎటువంటి ప్రకటన లేదు. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త ఫేక్ వార్తగా గుర్తించి బ్యాంకుల ఖాతాదారులు ఊపిరి పీల్చుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+