అఫైర్ ఆరోపణలు: కూతురితో పాటు మహిళ ఆత్మహత్య

మృతులను 23 ఏళ్ల లత, ఆమె రెండేళ్ల కూతురు యోగితగా గుర్తించారు. లత స్టోన్ కట్టర్ కుమార్‌ను వివాహం చేసుకుంది. మంగళవారంనాడు కుమార్ కజిన్ నర్సింహ భార్య, సోదరి లత ఇంటికి వచ్చారు. నర్సింహతో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ లతను తిట్టిపోశారు.
తీవ్ర మనస్తాపానికి గురైన లత వారి వెళ్లిపోగానే కూతురిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. వారు లతను తిట్టడమే కాకుండా కొట్టారు కూడా.
లత తన కూతురు ఒంటిపై కిరోసిన్ పోసింది, తన ఒంటిపై కూడా పోసుకుంది. కూతురికి నిప్పంటించి, తాను నిప్పు పెట్టుకుంది. ఈ విషాద సంఘనట స్థానికంగా తీవ్ర కలవరానికి గురి చేసింది.












Click it and Unblock the Notifications