ఎస్కేయూ విద్యార్థిని ఆత్మహత్య: ప్రేమించాడు, పెళ్లి చేసుకోమంటే అసలు విషయం చెప్పాడు

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్సిటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడు సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్కేయులో జువాలజీ విద్యార్థిని లక్ష్మీప్రసన్న ఈ నెల 18వ తేదీన హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: ఎస్కే వర్సిటీలో ఆత్మహత్య, అందుకేనా: 35 సంవత్సరాలలో తొలి మరక

కేసులో నిందితుడు విశాఖపట్నానికి చెందిన సురేష్. అతనిని ఇటుకలపల్లి ఎస్సై ఆధ్వర్యంలో విశాఖకు వెళ్లి అరెస్టు చేశారు. ఆదివారం ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. అనంతరం రిమాండుకు తరలించారు.

ప్రేమ పేరుతో వంచించాడు

ప్రేమ పేరుతో వంచించాడు

విశాఖపట్టణానికి చెందిన సురేష్ సోషల్ మీడియా వేదిక పేస్‌బుక్ ద్వారా లక్ష్మీప్రసన్నతో పరిచయం చేసుకున్నాడు. ప్రేమ పేరుతో వంచించి చివరకు అమ్మాయి ఆత్మహత్యకు కారణమైనట్లుగా గుర్తించారు.

పెళ్లైన విషయం దాచిపెట్టాడు

పెళ్లైన విషయం దాచిపెట్టాడు

నిందితుడికి అప్పటికే పెళ్లయింది. ఆ విషయాన్ని దాచిపెట్టి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆమె తీవ్ర మనస్తాపానికి గురైన ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని విచారించిన పోలీసులు అతని నుంచి కొన్ని విషయాలు రాబట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది.

పరిచయం ప్రేమగా మారింది

పరిచయం ప్రేమగా మారింది

పోలీసులు తెలిపిన వివరాల మేరకు... విశాఖపట్నంలో ఉంటున్న సురేష్‌తో ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సురేష్‌ ఆన్‌లైన్‌లో తరగతులు చెబుతూ ఉపాధి పొందుతున్నాడు. ఇలా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే సురేష్‌కు వివాహమైన విషయాన్ని దాచి పెట్టాడు.

పెళ్లి చేసుకోమని చెప్పడంతో అసలు విషయం చెప్పాడు

పెళ్లి చేసుకోమని చెప్పడంతో అసలు విషయం చెప్పాడు

పెళ్లి చేసుకోవాలని లక్ష్మీప్రసన్న కోరడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని సెల్ ఫోన్ ద్వారా ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌ ఆధ్వర్యంలో నిందితుడిని గుర్తించారు. అదుపులోకి తీసుకొని విచారణ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Accused arrested from Vishakhapatnam in Sri Krishna Devaraya University girl student suicide case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి