అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్కే వర్సిటీలో ఆత్మహత్య, అందుకేనా: 35 సంవత్సరాలలో తొలి మరక

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎస్కే వర్సిటీ : 35 సంవత్సరాలలో తొలి మరక | Oneindia Telugu

అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీజీ జువాలజీ రెండో సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆమె చనిపోయింది. గోరంట్లలోని చౌడేశ్వరి కాలనీకి చెందిన నాగరాజు, లక్ష్మీదేవమ్మల కూతురు లక్ష్మీప్రసన్న.

ఎస్కేయూలో చదువుతోంది. గోదావరి హాస్టల్‌లో ఉండేది. సోమవారం ఉదయం పది గంటలకు కళాశాలకు వెళ్లిన ఆమె ఆరోగ్యం బాగోలేదని అనుమతి తీసుకుని, హాస్టల్‌కు వచ్చింది. ఆ సమయంలో విద్యార్థులందరూ కాలేజీకి వెళ్లారు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడింది.

 నెయిల్ పాలిష్ తాగి, ఫ్యాన్‌కు ఉరేసుకొని

నెయిల్ పాలిష్ తాగి, ఫ్యాన్‌కు ఉరేసుకొని

ఆమె తొలుత నెయిల్ పాలిష్ తాగింది. ఆ తర్వాత గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. క్లాసులు ముగిసిన తర్వాత తోటి విద్యార్థులు వచ్చి చూసేసరికి ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ప్రిన్సిపాల్‌, వార్డెన్‌కు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని, శవాన్ని అనంతపురం ఆసుపత్రికి తరలించారు.

లక్ష్మీప్రసన్న చురుగ్గా ఉండేది

లక్ష్మీప్రసన్న చురుగ్గా ఉండేది

లక్ష్మీప్రసన్న చదువులో చాలా చురుగ్గా ఉండేదనీ, వ్యక్తిగత సమస్యలను ఎవ్వ రికీ చెప్పలేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. వ్యక్తిగత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాఫ్తు చేపట్టారు. కాగా, ఎస్కే వర్సిటీ ప్రారంభమై 35 సంవత్సరాలు దాటింది. ఈ వర్సిటీ చరిత్రలో ఇదే తొలి ఆత్మహత్య అంటున్నారు. గతంలో ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు.

 వేధింపుల వల్లేనని

వేధింపుల వల్లేనని

లక్ష్మీప్రసన్న ఆత్మహత్య విషయం తెలియగానే తల్లితండ్రులు ఆసుపత్రికి వచ్చారు. మృతదేహాన్ని చూసి విలపించారు. విద్యార్థిని బాగా చ దువుతుందనీ, ఒక ఆచార్యుడి వేధింపులు భ రించలేకే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలనీ, మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలన్నారు.

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్

లక్ష్మీప్రసన్న ఆత్మహత్య నేపథ్యంలో ఆమె స్వగ్రామం గోరంట్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరిది చేనేత కుటుంబం. కాగా, లక్ష్మీప్రసన్న ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం సెలవు ప్రకటించారు. ఆమె కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.

English summary
PG Student Commits Suicide at Sri Krishna Devaraya University in Anantapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X