ఏనుగు మృతి కేసు నిందితుడి ఆత్మహత్య
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రామాపురం తండాలో ఏనుగు మృతి చెందిన కేసులో మూడవ నిందితుడైన గోవిందప్ప (40) బుధవారం అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాటుచేసిన కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఏనుగు మృతి చెందిన విషయం విదితమే.
ఈ కేసులో నిందితులుగా ఉన్న వీర్నమల పంచాయతీ పోడుచేనుకు చెందిన జయశంకర్ (35), నీళ్లచేనుకు చెందిన రవిప్ప (36)లను అటవీ శాఖాధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. దీంతో భయాందోళన చెందిన గోవిందప్ప అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

విజయవాడ: మధ్యాహ్నం భోజనానంతరం స్నానం చేసేందుకై సరదాగా కృష్ణానదిలోకి దిగిన గుంటుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
పదో తరగతి విద్యార్థులు చిన్నబోయిన తేజ, బంగాల వెంకయ్య, 8వ తరగతి చదువుతున్న బడేమియ, బాదం గోపి, సామ్యూల్ బుధవారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు సమీపంలోని కృష్ణానది తీరంలోకి దిగి కొట్టుకుపోయారు. సమీపంలో ఇసుక పనిచేసేవారు ఇద్దరిని కాపాడగలిగారు.












Click it and Unblock the Notifications