అరెస్టు: భర్తను కొట్టి భార్యపై, ఆమెను కొట్టి కూతుళ్లపై రేప్ యత్నం
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 21వ తేదీన ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో వడ్లమూడి బాలకృష్ణ (28) అనే యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు.
ఇంటి యజమాని రాంబాబాను గాయపరిచి ఆమె భార్యపై అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమను రాడ్‌తో కొట్టి చంపబోయాడు. ఆ తర్వాత వాళ్ల ఇద్దరు కూతుళ్లపై కూడా అత్యాచారం చేయబోయాడు. వీలు కాకపోవడంతో గ్యాస్ లీక్ చేసి నిప్పంటించాడు.
ఈ సంఘటనలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు స్థానికులు వచ్చి మంటలు ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి స్వగ్రామం దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామం.

యువకుడి అనుమానాస్పద మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ సంఘటన జిల్లాలోని పాలకొల్లు మండలం అగరు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రాానికి చెందిన పెద్దిరామ్ (27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మంగళవారం రాత్రి ఇంటికి చేరుకున్న పెద్దిరామ్ బుధవారం ఉదయానికి శవమైన కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications