విద్రోహ కుట్ర: రాజమండ్రి తొక్కిసలాటపై అచ్చన్న, కాల్వలో పడిన దేవినేని
శ్రీకాకుళం/విజయవాడ: గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో తొలి రోజు జరిగిన ఘటన పైన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి రోజు జరిగిన తొక్కిసలాట వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని సమాచారం అందిందని అనుమానం వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందన్న కారణంగా అది చెడగొట్టేందుకు ఘటనకు ముందే విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి చెందినట్లుగా ప్రచారం జరిగిందన్నారు.

అందువల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ అంశాన్ని న్యాయవిచారణ జరిపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4.12 కోట్ల మంది పుష్కర స్నానం ఆచరించారని చెప్పారు. చివరి రెండు రోజులు జనం పోటెత్తుతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు.
కాలువలో జారిపడిన దేవినేని
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు గురువారం నాడు ప్రమాదం తప్పింది. ఆయన సాయంత్రం గన్నవరం మండలం చిక్కవరం వద్ద పోలవరం కుడి కాల్వ పనులు పరిశీలిస్తున్నారు. పనులపై అధికారులతో మాట్లాడుతుండగా ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అధికారులు, ఇతర సిబ్బంది ఆయనను బయటకు లాగారు.












Click it and Unblock the Notifications