సీజేఐ ఎన్వీ రమణకు మరో గౌరవం - అమరావతి కేంద్రంగా..!!
సీజేఐ ఎన్వీ రమణకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కనుంది. చదువుకున్న చోటే ఆయన ఆ గౌరవం అందుకోనున్నారు. సీజేఐగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దీనికి ముందుగానే సీజేఐ హోదాలో గౌరవ డాక్టరేట్ అందుకోబోతున్నారు. జస్టిస్ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయాలని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ సీజేఐను గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళసై ఈ డాక్టరేట్ ప్రధాని చేసారు.

చదువుకున్న వర్సిటీ నుంచే..ఇప్పుడు
ఇప్పుడు..జస్టిస్ ఎన్వీ రమణ చదువుకున్న యూనివర్సిటీ నుంచే ఈ పురస్కారం దక్కించుకోనున్నారు. ఈ మేరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ నెల 20న యూనివర్సిటీ ప్రాంగణంలో 37,38వ స్నాతకోత్సవం జరగనుంది. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి విశిష్ఠ అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణను యూనివర్సిటీ ఆహ్వానించింది. యూనివర్సిటీ తరపున ఆయనకు డాక్టరేట్ ప్రధాన చేసేందుకు మార్చి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. వాయిదా పడుతూ వచ్చిందని వర్సిటీ ముఖ్య అధికారులు చెప్పారు. నాగార్జున విశ్వ విద్యాలయంలో న్యాయ విద్య అభ్యసించిన మొదటి బ్యాచ్ విద్యార్ధిగా.. ఇప్పుడు సీజేఐ హోదాలో చదువుకున్న వర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకోబోతున్నారు.
Recommended Video


సీజేఐ హోదాలో రెండో సారి వర్సిటీకి
వర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీజేఐ కు డాక్టరేట్ ఇవ్వాలని నాగార్జున విశ్వవిద్యాలయం నిర్ణయించగా.. రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా గవర్నర్ నుంచి ఆమోద ముద్ర లభించింది. అమరావతి పరిధిలో నాగార్జున యూనివర్సిటీ ఉండటంతో.. అమరావతి కేంద్రంగా తాను చుదువుకున్న ప్రాంతంలోని తన సహచరులు.. మిత్రుల సమక్షంలో ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. గత ఏడాది సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారి కృష్ణా- గుంటూరు జిల్లాల్లో సీజేఐ ఎన్వీ రమణ రెండు రోజుల పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సత్కార కార్యక్రమం నిర్వహించారు.

రెండు యూనివర్సిటీలు.. రెండు డాక్టరేట్లు
గవర్నర్ రాజ్ భవన్ లోనూ ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ పర్యటనలోనే రాజధాని గ్రామాల్లో ఉన్న హైకోర్టును ఆయన సందర్శించారు. ఇక, నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన న్యాయాధికారుల సదస్సులో పాల్గొన్నారు. న్యాయ విద్యార్దిగా.. హాజరైన ప్రాంగణంలోనే ఇప్పుడు సీజేఐ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. సరిగ్గా పదవీ విరమణకు వారం రోజుల ముందు ఈ పురస్కార ప్రధానం జరగనుంది. దీంతో..ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రముఖ వర్సిటీలు .. గౌరవ డాక్టరేట్లతో సీజేఐ హోదాలో ఉన్న తెలుగు వ్యక్తికి గుర్తింపు దక్కింది.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications