నంది అవార్డులపై నటుడు జీవీ సంచలన వ్యాఖ్యలు, చిరంజీవిపై అభిమానం వల్లే
నంది అవార్డుల వివాదం చల్లారేలా లేదు. వీటిపై పలువురు నటులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే వైసీపీలోను భిన్న రాగాలు వినిపించాయి.
రాజమహేంద్రవరం: నంది అవార్డుల వివాదం చల్లారేలా లేదు. వీటిపై పలువురు నటులతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే వైసీపీలోను భిన్న రాగాలు వినిపించాయి.

నంది అవార్డులపై రగడ
నంది అవార్డులను నటుడు పోసాని కృష్ణమురళి తప్పుపట్టడాన్ని వైసీపీ నేత ఆదిశేషగిరి రావు ఖండించారు. అదే సమయంలో నంది అవార్డులను అంబటి రాంబాబు తప్పుబట్టారు. ఆదిశేషగిరి రావు వ్యాఖ్యల గురించి తనకు తెలియదని, తాను చెప్పిందే పార్టీ అభిప్రాయమని తెలిపారు.

జీవీ సుధాకర్ నాయుడు షాకింగ్ కామెంట్స్
తాజాగా, నటుడు జీవీ సుధాకర్ నాయుడు నంది అవార్డులపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఎల్లోగా మార్చేసిందని వ్యాఖ్యలు
చిత్ర పరిశ్రమను, నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ఎల్లోగా మార్చివేసిందని జీవీ విమర్శించారు. ఈ అవార్డులు కచ్చితంగా ఎల్లో నందులే అన్నారు. చిత్ర పరిశ్రమకు తాను దాసరి నారాయణరావు ప్రోద్బలంతో వచ్చానని, తనకు చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని గురించి తెలుసుకున్న దాసరి, తన పేరు ప్రారంభంలో చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలనూ చేర్చారని చెప్పారు.

తన పేరుపై ఇలా
అలా తన పేరు ముందు జీవి స్థిరపడిందని జీవీ చెప్పారు. త్వరలోనే వంగవీటి సినిమాను తాను స్వయంగా తీయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో గత పదేళ్లుగా 100 మందికి పైగా పేద ముస్లిం విద్యార్థినీ విద్యార్థులను తాను చదివిస్తున్నానని తెలిపారు.












Click it and Unblock the Notifications