రఘురామకు చెక్: నర్సాపురం నుంచి కృష్ణంరాజు భార్య?: అండగా ప్రభాస్
భీమవరం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరుకుడు పడని నియోజకవర్గాల్లో ఒకటి- పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం లోక్‌సభ. ఈ స్థానం వైఎస్ఆర్సీపీదే. అయినప్పటికీ- అక్కడ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటోన్నారు. తిరుగుబాటు నేతగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సొంత పార్టీ వైఖరిని తప్పుపడుతూ వస్తోన్నారు.
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం మరోసారి రఘురామ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలనుకోవట్లేదు వైసీపీ అగ్రనాయకత్వం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల నుంచీ రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోన్న రఘురామకు బదులుగా నర్సాపురం లోక్‌సభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది.

దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలా దేవిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆమెతో వైఎస్ఆర్సీపీ సంప్రదింపులు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న లోక్‌సభ సభ్యుడు ఇప్పటికే ఈ సంకేతాలను పంపించారని తెలుస్తోంది. దీనికి శ్యామలా దేవి ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని సమాచారం. మున్ముందు ఆమె తమ ప్రతిపాదనలను అంగీకరిస్తారని వైసీపీ ఆశిస్తోంది.
నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటుబ్యాంక్. రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32 వేల ఓట్ల తేడాతో ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటోన్నారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన శ్యామలా దేవికి నర్సాపురం లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది.

గతంలో శ్యామలా దేవి భర్త, దివంగత నటుడు కృష్ణంరాజు ఇదే నర్సాపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. 1999 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, లక్షా 65 వేలకు పైగా ఓట్ల తేడాతో తిరుగులేని విజయం సాధించారు. అనంతరం అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో రక్షణశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2004లో కూడా పోటీ చేశారు గానీ విజయం దక్కలేదు.
అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామ జోగయ్య చేతిలో పరాజయాన్ని చవి చూశారు. ఇప్పుడు అదే నర్సాపురం లోక్‌సభ నుంచి శ్యామలా దేవిని బరిలోకి దింపడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. దీనిపై సంప్రదింపులు సైతం సాగాయి. ప్రస్తుతానికి శ్యామలా దేవి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని అంటున్నారు. సానుకూలంగా స్పందిస్తారనే ప్రచారం జరుగుతోంది.
గతంలో తన భర్త కృష్ణంరాజు ప్రాతినిథ్యాన్ని వహించిన నియోజకవర్గం కావడం వల్ల శ్యామలా దేవి వైసీపీ చేసిన ప్రతిపాదనలను అంగీకరించడానికే అధిక అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆమెకు అభ్యర్థిత్వం ఖరారయితే.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. వైసీపీ తరఫున ప్రచారానికి రావడం ఖాయమౌతుంది. అదే జరిగితే- ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications