మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం చాలా పరిమితంగానే సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. సినిమాలను ఎంపిక చేసుకునే విషయంలో కథలను వినడంతోపాటు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత కాలంలో కులాలుండేవని, కానీ అందరూ అక్కడ, అత్త, మామ, అల్లుడూ అంటూ ఆప్యాయంగా పిలుచుకునేవారన్నారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని, మనుషులను కులం పేరుతో దూషిస్తున్నారన్నారు. కులాలను కనిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. బాల్యంలో తన స్నేహితుణ్ని అంటరానివాడు అని అన్నందుకు వారిని చెప్పుకో కొడతానన్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం కుల పిచ్చి బాగా ఎక్కువైందన్నారు.

ఇది నాశనానికి దారి తీస్తుందన్నారు. అందుకే తనకు కులాలంటే అసహ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలోని తన యూనివర్సిటీలో మోహన్ బాబు మొక్కలు నాటారు. ఆయనకు సంబంధించిన కొత్త ప్రాజెక్టుపై త్వరలోనే ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెమ్యునరేషన్ కూడా భారీస్థాయిలో ఉంది.
మోహన్ బాబుకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారీ బడ్జెట్ సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కుల వ్యవస్థ గురించి మోహన్ బాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. మోహన్ బాబు వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు వ్యక్తమవుతోంది. ఆయన పెద్ద కుమారుడు విష్ణు, చిన్న కుమారుడు మనోజ్, కుమార్తె లక్ష్మీప్రసన్న సినిమా రంగంలోనే స్థిరపడ్డారు.












Click it and Unblock the Notifications