వైఎస్ జగన్, వైసీపీ మంత్రులకు అంతర్జాతీయ అవార్డులు, ప్రపంచంలో నెంబర్ వన్, పృథ్వీరాజ్
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో గెలిపించాలని కొందరు నటులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజక వర్గాల్లో కూడా ఈ నటులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నటుడు, దర్శకుడు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
గతంలో వైసీపీలో ఉన్న పృథ్వీరాజ్ తరువాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇటీవల జనసేన పార్టీలో చేరారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న అరణి శ్రీనివాసులు తరపున పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్ వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ మంత్రుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినీతిలో అంతర్జాతీయ పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, సీఎం వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీ మంత్రులు పోటీ పడుతారని, అందులో ఎలాంటి సందేహం లేదని పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా సీఎం వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుడు ఈ ప్రపంచంలోనే లేడని, ఆలీబాబా 40 దొంగలు కంటే ఎక్కువగానే ఆంధ్రప్రదేశ్ లో జగన్, ఆయన మంత్రులు దోపిడీ చేశారని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలు, ఊరుఊరు తిరుగుతూ సొంత అన్న చేసిన అవనీతి గురించి చాటి చెబుతున్నారని, సొంత చెల్లెలే జగన్ మీద ఇన్ని ఆరోపణలు చెయ్యడం చూస్తే అది అపద్దం ఎలా అవుతుందని, జగన్ దోపిడీ చేసింది నిజం అని పృథ్వీరాజ్ ఆరోపించారు. సీఎం జగన్ మీద అపద్దాలు చెప్పాల్సిన అవసరం షర్మిలాకు ఏముంది, ఆమె పచ్చి నిజాలు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలని పృథ్వీరాజ్ మనవి చేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పాటు ఆయన సహచర మంత్రులు, ఆయన సహచర ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోతారని ముందే వాళ్లకు తెలుసు అని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు పాటు వాళ్లు చేసిన ఘనకార్యాలు అలాంటివి అని జనసేన నాయకుడు, నటుడు పృథ్వీరాజ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కచ్చితంగా విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని, అందులో ఎలాంటి సందేహం లేదని సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు.
వైసీపీ అరచకాలు తట్టుకోలేక ఆ పార్టీకి చెందిన అరణి శ్రీనివాసులు వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన టిక్కెట్ మీద తిరుపతిలో పోటీ చేస్తున్నారని, ఆయన్ను గెలిపించాలని నటుడు పృథ్వీరాజ్ తిరుపతి ప్రజలకు మనవి చేశారు. తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న నటుడు పృథ్వీరాజ్ జనసేన పార్టీ అభ్యర్థి అరణి శ్రీనివాసులు అలియాస్ జంగాలపల్లె శ్రీనివాసులు గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి టిక్కెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసిన అరణి శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications