ఒంటరి విషాదం: నటుడి కూతురు ఆత్మహత్య

ఆరేళ్ల క్రితం ఆమె భర్త ఎన్. నరేందర్ మరణించారు. మరో రెండు రోజుల్లో అతని వర్ధంతి చేయాల్సి ఉంది. ఏడాది క్రితం ఆమె ఇద్దరు కుమారుల వివాహం చేసింది. వారు విడిగా ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం ధనలక్ష్మి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అటు భర్తను కోల్పోయి, ఇటు పిల్లలకు దూరమై ధనలక్ష్మి ఒంటరితనంతో వేగిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. దాంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు సంఘటనపై దర్యాప్తు సాగిస్తున్నారు.
బాలికపై కిరోసిన పోసి నిప్పు...
గుంటూరు జిల్లాలోని ఈపూరు మండలం బొగ్గరంలో శనివారంనాడు ఓ సవతి తల్లి తన కూతురి పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించింది. చంద్రమ్మ అనే బాలికపై సవతి తల్లి కిరోసిన్ పోసి నిప్పంటించింది. స్థానికులు బాలికను వినుకొండ ఆస్పత్రికి తరలించారు.
తాను గదిలో బట్టలు తీసుకుంటుండగా తలుపు గడియ పెట్టి, సవతి తల్లి కిరోసిన్ పోసీ నిప్పంటించిందని పోలీసులకు బాలిక చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సవతి తల్లి ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications