పోలీసుల్ని ఆశ్రయించిన రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్, ఏం జరిగిందంటే..

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: సినీ నటి సిరిప్రియ మంగళవారం నాడు తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులను ఆశ్రయించారు. వారం రోజుల క్రితం సామర్లకోటకు చెందిన ప్రసన్న కుమార్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. ప్రసన్న కుటుంబ సభ్యుల నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది.

సిరిప్రియ నటించటిన ఓ సినిమా త్వరలో విడుదల కానుంది. ఆమె పలు షార్ట్ ఫిలింలలో నటించింది. ఆమె అసలు పేరు చంద్రకళ అని తెలుస్తోంది. ప్రసన్న కుమార్ ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. వారం క్రితం పెళ్లి చేసుకున్నారు.

తాను వారం క్రితం ప్రసన్నను పెళ్లి చేసుకున్నానని, అతని కుటుంబ సభ్యులు తమ ప్రేమ వివాహాన్ని అంగీకరించడం లేదని, తన భర్తను తన నుంచి వేరు చేసేందుకు చూస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని ఆమె చెబుతున్నారు. తాను జీవనం కోసం రొమాంటిక్ స్మార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్నానని చెప్పారు. సినిమాల్లో ఉండే వాళ్లంతా తప్పులు చేస్తూ బతకరని, అలాగే మంచివాళ్లే ఉండరన్నారు.

Actress approaches Police

తనను తాను నిరూపించుకునేందుకు అవకాశమివ్వాలని తన భర్త కుటుంబ సభ్యులను కోరుతున్నానని చెప్పారు. కుటుంబానికి తనను కోడిలిగా చేసుకోవడం ఇష్టం లేకుంటే, తన భర్తను తనను వదిలేయాలని, తామిద్దరం వేరుగా బతుకుతామని, తమకు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి హాని కలగకూడదన్నారు.

కాగా, ప్రసన్నకుమార్ పైన సామర్లకోట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదై ఉంది. దీంతో రెండు రోజుల క్రితం అతనిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. దీంతో ఈ వివాదం వెలుగు చూసింది. ప్రసన్న కుమార్ కూడా ప్రేమ వివాహం చేసుకున్న భార్యతో కలిసి జీవించేందుకు ఇష్టపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Siripriya approaches Police in East Godavari district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి