నటి హేమాశ్రీ హత్య: 36 నెలలకు ఆమె భర్తకు బెయిల్
బెంగళూరు: బహుబాష నటి హేమాశ్రీ హత్య కేసులో ఆమె భర్త సురేంద్ర బాబుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయ్యింది. సురేంద్ర బాబుకు షరతులతో బుధవారం బెయిల్ మంజూరు అయ్యింది. పరప్పన అగ్రహార జైలులో ఉన్న సురేంద్ర బాబు బయటకు రానున్నాడు.
సురేంద్ర బాబు సాక్షులను లోంగదీసుకోవడానికి నగదు ఆశ చూపించాడని ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం కు చెందిన మహేష్ తోపాటు ముగ్గురు ఫాం హౌస్ కార్మికులు, కృష్ణ అనే వ్యక్తులతో సురేంద్ర బాబు సోదరులు మణిపాల్, జయపాల్ మద్యవర్తిత్వం చేసిన వీడియో క్లిప్పింగ్ లు బయటకు వచ్చాయి.
విచారణలో సాక్షులు సరైన సమాదానం ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. హేమాశ్రీని సురేంద్ర బాబు రెండవ వివాహం చేసుకున్నాడు. 2012 అక్టోబర్ 8వ తేదిన సురేంద్ర బాబు, హేమాశ్రీ కారులో హైదరాబాద్ బయలుదేరారు.

హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ఉంటే హేమాశ్రీ బయలుదేరింది. అదే రోజు అర్దరాత్రి మార్గం మద్యలో అనంతపురానికి చెందిన మాజీ కార్పొరేటర్ మురళికి చెందిన రెడ్డిపల్లి ఫాం హౌస్ లోకి హేమాశ్రీని తీసుకు వెళ్లారు. తరువాత ఆమెకు మోతాదుకు మించిన క్లోరోఫాం ఇవ్వడం వలన మరణించిందని ఆరోపణలు వచ్చాయి.
అనంతపురం పోలీసులు, బెంగళూరు పోలీసులు కేసు విచారణ చేశారు. హేమాశ్రీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో బెంగళూరు పోలీసులు సురేంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి సురేంద్ర బాబు జైలు జీవితం గడుపుతున్నాడు.
సురేంద్ర బాబు కర్ణాటకలో పార్లమెంట్ ఎన్నికలలో పోటి చేసి ఓడిపోయారు. ఇతను ఒక బలమైన సామాజిక వర్గం నాయకుడు. పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తి కావడంతో ఇంత కాలం బెయిల్ ఇవ్వరాదని పోలీసులు న్యాయస్థానంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు.












Click it and Unblock the Notifications