వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పౌడర్ బాగా పనిచేసినట్టుంది: వైఎస్ జగన్‌పై తెలుగు నటి సెటైర్లు: ఆడేసుకుంటున్న నెటిజన్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలకు సంబంధించిన ఘటన వెలుగుచూడటానికి ముందు..మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి స్వస్థలానికి చేరుకున్న వారిని సకాలంలో గుర్తించగలిగారు అధికారులు. వారిని క్వారంటైన్లకు తరలించారు. ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి నాణ్యమైన చికిత్సను అందించగలిగారు.

Recommended Video

Actress Satires On AP CM YS Jagan

ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...

వైఎస్ జగన్‌కు నెగెటివ్ రావడంతో..

ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనల అనంతరం రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.. కట్టుతప్పింది. ఈ విషయాన్ని మంత్రులు సైతం కొన్ని సందర్భాల్లో స్పష్టం చేశారు. దీన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు, తమిళనటి కస్తూరి చేసిన ఓ సెటైరికల్ కామెంట్..రాష్ట్రంలో దుమారాన్ని రేపింది. వైఎస్ జగన్ కరోనా వైరస్ పరీక్షలను చేయించుకోవడం, నెగెటివ్ రిపోర్ట్ రావడం ఆమె సెటైర్లకు సెంటరిక్ పాయింట్‌గా మారింది.

సింగిల్ లైన్ సెటైరికల్ కామెంట్

సింగిల్ లైన్ సెటైరికల్ కామెంట్

కరోనా వైరస్ పరీక్షలను వేగవంతం చేయడానికి జగన్ సర్కార్.. రెండురోజుల కిందటే దక్షిణ కొరియా నుంచి కోవిడ్-19 కిట్స్‌ను తెప్పించింది విషయం తెలిసిందే. ఈ కిట్స్ ద్వారా 10 నిమిషాల్లోనే వైరస్ పరీక్షల ఫలితాలు వెల్లడవుతాయి. ఈ కిట్స్‌ను ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్..తాను కరోనా వైరస్ పరీక్షలను చేయించుకున్నారు. ఆయనకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీన్ని బేస్‌గా చేసుకుని కస్తూరి సెటైరికల్‌గా కామెంట్ చేశారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ బాగా పనిచేసినట్టుంది అంటూ ఓ సింగిల్ లైన్ సెటైరికల్ కామెంట్ చేశారు.

పారాసిటమాల్.. బ్లీచింగ్ పౌడర్ ప్రస్తావన..

పారాసిటమాల్.. బ్లీచింగ్ పౌడర్ ప్రస్తావన..

కరోనా సోకిన పేషెంట్లకు అందజేసే వైద్య చికిత్సలో పారాసిటమాల్ మాత్రలను వినియోగించవచ్చని, బ్లీచింగ్ పౌడర్‌ను చల్లడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చని, దీని ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని ఇదివరకు వైఎస్ జగన్ చెప్పిన మాటలను నటి కస్తూరి.. తన కామెంట్స్‌లో ప్రస్తావించారు. వైఎస్ జగన్‌కు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందంటూ జర్నలిస్ట్ ధన్యా రాజేంద్రన్ చేసిన ఓ ట్వీట్‌కు కస్తూరి రిప్లయ్ ఇస్తూ.. ఆ సెటైరికల్ కామెంట్స్‌ను పోస్ట్ చేశారు.

దుమారం రేపుతోన్న కామెంట్

దుమారం రేపుతోన్న కామెంట్

ఇది కాస్తా దుమారానికి దారి తీసింది.. సహజంగానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు, ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు ఈ కామెంట్స్‌పై స్పందిస్తున్నారు. జగన్ సర్కార్‌పై వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. కస్తూరి చేసిన కామెంట్స్ అధికార వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఘాటుగా స్పందిస్తోంది. ఆమెపైనా సెటైరికల్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఉంటూ ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి కామెంట్స్ చేయడాన్ని తప్పపడుతున్నారు.

English summary
Telugu, Tamil actress Kasthuri Shanka satirical comments on Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy after tested as Coronavirus Covid-19 Negative. She posted her comment on a tweet as may be the paracetamol and bleaching powder do work after all.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X