ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
టీడీపీ నాయకులు టికెట్ ఇస్తారని చెప్పి తనని మోసం చేశారని ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ శ్రీ రాపాక టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు.తనకి టీడీపీ నేతలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పారు. కానీ తీరా ఎన్నికల్లో తనకు టికెట్ దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో శ్రీ రాపాక వైసీపీ తరుఫురం ప్రచారం నిర్వహించారు. దీంతో ఈసారి జరిగిన ఎన్నికల్లో శ్రీ రాపాకకు వైసీపీ నుంచి టికెట్ దక్కుతుందని వార్తలొచ్చాయి. అయితే ఆమెకు వైసీపీ నుంచి మొండిచేయి ఎదురైంది.
అయితే ఎన్నికల ముందు ఆమె టీడీపీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీ రాపాక కూటమి నేతల గెలుపుకు తన వంతు కృషి చేశారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున పని చేసిన తాను..ఈసారి కూటమి గెలుపుకు కృషి చేశానని శ్రీ రాపాక తెలిపారు. అయితే తనకు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చిన తర్వాతే తాను పార్టీ మారానని ఆమె చెప్పుకొచ్చారు. టికెట్ హామీ ఇచ్చిన తర్వాతే తాను టీడీపీలో చేరానని..తనతో అచ్చంనాయుడు కూడా మాట్లాడారని శ్రీ రాపాక వెల్లడించారు.

అయితే టీడీపీలో చేరిన తర్వాత తనకు టికెట్ దక్కలేదని శ్రీ రాపాక వాపోయారు. టికెట్ దక్కుతుందేమో అని చివరి నిమిషం వరకు ఎంతో అతృతుగా ఎదురు చూశానని..అయితే గతంలో బరిలో నిలిచిన వ్యక్తికే టికెట్ కేటాయించారని ఆమె పేర్కొన్నారు. టికెట్ దక్కకపోయినప్పటికి కూటమి తరుఫున ప్రచారం చేశానని శ్రీ రాపాక చెప్పారు.
సినిమాలు వేరని రాజకీయాలు వేరని తాను పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు పద్దతిగానే తన డ్రెస్సింగ్ స్టైల్‌ను మార్చుకున్నానని ఈ హాట్ హీరోయిన్ చెప్పుకొచ్చింది. వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన Naked సినిమాతో శ్రీ రాపాక ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్‌గా మారింది.












Click it and Unblock the Notifications