యాంకర్ శ్యామలను ఏకిపారేసిన శ్రీరెడ్డి.. రెడ్ లైట్ అంటూ దారుణంగా
నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉందని మొట్ట మొదటిసారి ధైర్యంగా చెప్పిన నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆఫర్లు ఇస్తామని చెప్పి పలువురు మహిళలను లైంగికంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై ఆమె కొన్ని సాక్ష్యాలను కూడా బయటపెట్టడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇక తర్వాత శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీని పెంచుకుంది.
తెలుగు ఇండస్ట్రీపై తనదైనశైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వివాదాల్లో నిలుస్తోంది. రాజకీయ విమర్శలు చేయడానికి కూడా శ్రీరెడ్డి ఏమాత్రం మొహటపడదనే విషయం అందిరికి తెలిసిందే. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటుంది. ఆమె ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మద్దతుగా ఎన్నో వీడియోలు చేశారామె. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలపై కూడా తన ధిక్కార స్వరం వినిపిస్తోంది. నాకు వైసీపీ వాళ్లు ఏనాడు మద్దతిచ్చింది లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

వైసీపీ వాళ్లు నన్ను తన పార్టీ మనిషిగా గుర్తించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీలో కొందరి నాయకుల వల్ల పార్టీ ఓడిపోయిందని చెప్పి కొందరి నేతలపై విమర్శలు గుప్పించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పవన్ కల్యాణ్‌పై రెచ్చిపోతూ పోస్ట్‌లు పెట్టారామె. శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధినేత జగన్ పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టిన సంగతి తెలిసిందే.
Sri Reddy is Jealous yaa 🤣🤣 pic.twitter.com/pxXVWOaiZi
— Twood Trolls ™ (@TT_2_0) October 17, 2024
దీనిలో భాగంగానే యాంకర్ శ్యామలకు పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడంపై శ్రీరెడ్డి మండిపడ్డారు. ''అదృష్టం అంటే ఈమెదే.. ఏమీ పార్టీ కోసం పని చేయకపోయినా అందలం ఎక్కించారు. జై వైఎస్సార్సీపీ, బెదిరింపులు, తిట్లు ఏమో మాకు పోస్టింగులు, ప్రెస్ మీట్‌లు మూతి వంకర అందగత్తెలకి. పార్టీలోని ఆమెని తెలిసి తీసుకున్నారా? తెలియకనా. మైకులు ఆమె దగ్గరకు వెళ్తున్నాయి. రెడ్ లైట్‌ని తెగ హైలెట్ చేస్తున్నారు. ఇక శని నెత్తి మీద కూర్చున్నట్టే. జస్ట్ వెయిట్ మీకే తెలుస్తుంది'' అంటూ యాంకర్ శ్యామలపై తన అక్కసును వెళ్లగక్కింది.
-
మళ్లీ వాయిదా.. "పెద్ది" మూవీ మరో 'హరిహర వీరమల్లు' కానుందా ??? -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
మావిగాన్ ను జనాల్లోకి తీసుకెళ్తున్న టీడీపీ..! పేర్ని నాని షాకింగ్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications