విద్యార్థి ఉసురు తీసిన ఆన్ లైన్ రమ్మి: ఇంటర్నెట్ పేకాట కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు

ఆన్ లైన్ రమ్మీ వ్యసనం బారిన పడి ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఇది.

రాజమంహేంద్రవరం: ఆన్ లైన్ గేమ్స్ మనుషుల పాలిట యమగండాలుగా మారుతున్నాయి. ఒకవైపు బ్లూ వేల్ గేమ్ లాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని బలిగొంటుంటే ఆన్ లైన్ రమ్మీ వంటివి మరి కొందరి చావుకు కారణమవుతున్నాయి.

ఇటీవలే విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఇంజనీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే రాజమండ్రిలో ఆన్ లైన్ రమ్మి వ్యసనం బారిన పడి మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని హౌసింగ్‌ బోర్డుకు చెందిన శ్రీరామ్‌ ఇంటర్‌మీడియట్ చదువుతున్నాడు. ఇతడికి ఇలాగో ఆన్ లైన్ రమ్మీ ఆడటం అలవాటైంది.

Addiction to online rummy: student ends life after losing money

ఢబ్బులు పెట్టి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడటం వ్యసనంగా మారింది. అదే పనిగా ఇంటర్నెట్ పేకాట ఆడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. వివిధ కారణాలు చెప్పి సేకరించిన డబ్బు ఆన్ లైన్ రమ్మీలో పోగొట్టుకోవడంతో ఇంట్లో సమాధానం చెప్పలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితుల ద్వారా ఈ విషయం అందరికి తెలియడంతో స్థానికంగా కలకలం రేగింది.

సాధారణంగా పేకాట పై నిషేధం ఉంది. బయట పేకాడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే ఈ ఆన్ లైన్ పేకాటకు అలాంటి భయం లేకపోవడంతో చాలామంది కంప్యూటర్లలో,సెల్‌ఫోన్లలో ఆన్‌లైన్‌ రమ్మీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని నిరాటంకంగా పేకాట ఆడేస్తున్నారు.

పైగా ఆన్ లైన్ రమ్మీలో లక్షలు గడించొచ్చంటూ ఆయా సంస్థలు భారీగా ప్రచారం చేస్తుండటం, పెద్ద సినీ తారలు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం తో జనం పెద్ద ఎత్తున దీని పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇలా ఆన్ లైన్ రమ్మీ వ్యసనంగా మారడంతో భారీగా డబ్బులు పోగొట్టుకుని చివరకు ఇలా బలవన్మరణాలకు పాల్పడే పరిస్థితి వస్తోంది. సో..బీ ఎలెర్ట్..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+