ఎసిబి సోదాలు: ఆదిశేషు అక్రమాస్తుల విలువ రూ. 100 కోట్లు
విజయవాడ: అతని అక్రమాస్తుల విలువ చూసి గుడ్లు తేలేయాల్సిందే. విజయవాడలోని ఆబ్కారీ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఇంటిపై బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులో చేసారు. అదే సమయంలో గుంటూరులోూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనూ ఎసిబి అధికారులు సోదాలు చేశారు.
గుంటూరు, ఏలూరుల్లోని ఆదిశేషు బంధువుల నివాసాల్లో ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఆదిశేషుకు చెందిన దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు సోదాల సందర్భంగా ఎసిబి అధికారులు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

సోదాలు బుధవారం సాయంత్రానికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ సోదాల్లో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పోరేషన్‌లో పనిచేస్తున్న ఆదిశేషు ఆదయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు వచ్చాయి.
తమకు అందిన సమాచారం మేరకు ఎసిబి అధికారులు ఆదిశేషు ఇంటిలోనే కాకుండా ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications