రెండో కాశ్మీర్‌గా ఆదిలాబాద్: మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
ఆదిలాబాద్: పర్యాటకులకు భారతదేశంలోని కాశ్మీర్ స్వర్గధామమైతే.. తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా కావాలని శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆకాంక్షించారు. ఆయన మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని కుంటాల జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, కొమురంభీం పేరిట స్మృతివనం ఏర్పాటు చేయాలన్నారు. అలా చేసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా రెండో కాశ్మీర్‌గా తయారవుతుందని వ్యాఖ్యానించారు.

కాశ్మీర్ తరహా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే జిల్లాలోని వనరులను, అటవీ ప్రాంతాన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సి ఉంటుందని స్వామిగౌడ్ అన్నారు. జిల్లాలో పర్యటించిన సందర్భంగా స్వామిగౌడ్‌ను ఉద్యోగ సంఘాలు ఘనంగా సన్మనించాయి.
అనంతరం జడ్పి సమావేశ మందిరంలో జడ్పి అత్యవసర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ‘మన జిల్లా - మన ప్రణాళిక'కు ఆమోదం తెలిపారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications