బాబుకు 'ఆదినారాయణరెడ్డి' దెబ్బ, షాకైన జగన్‌లో కొత్త హుషారు: టీడీపీ ఆందోళన

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: టీడీపీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటన అధికార పార్టీని ఇరకాటంలో పడేసింది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మొదలు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళనలు చేస్తూ వచ్చారు. వైసీపీ ఎంపీలు కూడా నిరసనలు తెలిపారు. కానీ వైసీపీని టీడీపీ కార్నర్ చేసింది.

  Chandrababu Over Special Package

  చదవండి: రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్

  జాతీయస్థాయిలో వైసీపీ కార్నర్ అయింది. మరోవైపు, ఏపీలోను టీడీపీ నేతలు బీజేపీతో తాడోపేడో అంటూ చెబుతూ అల్టిమేటం జారీ చేశారు. అయితే బీజేపీ పెద్దల ఫోన్లు, ఏపీకి కేంద్రం అవసరం, తాము బయటకు వస్తే జగన్ ఎన్డీయేలో చేరుతారనే ఆందోళన.. ఇలా పలు కారణాల వల్ల చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గురువారం టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జగన్‌ను మరింత ఇరుకున పడేసే ప్రణాళికలపై సమాలోచనలు జరిపారు. కానీ ఆది దెబ్బకు టీడీపీ కార్నర్ అయ్యే పరిస్థితి వచ్చింది.

  చదవండి: మీరు అలా చేయడం బాధించింది!: పవన్ కళ్యాణ్‌పై టీడీపీ

  టీడీపీని కార్నర్ చేసిన ఆదినారాయణ రెడ్డి ఆవేశం

  టీడీపీని కార్నర్ చేసిన ఆదినారాయణ రెడ్డి ఆవేశం

  అయితే, ఏపీకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోను ఊరకునేది లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అవసరమైతే బీజేపీతో బంధాన్ని తెంచుకుంటామని చెబుతూ.. మరోవైపు కేంద్రం అవసరం దృష్ట్యా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి ఆవేశంలో చేసిన ప్రకటన టీడీపీని ఒక్కసారిగా కార్నర్ చేసింది.

  జగన్ చేతికి ఆయుధాలు

  జగన్ చేతికి ఆయుధాలు

  ఆదినారాయణ రెడ్డి కేంద్రమంత్రుల రాజీనామా ప్రకటన, ఆ తర్వాత కాసేపట్లోనే అది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం.. టీడీపీని పలు రకాలగా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు, జగన్‌కు ఒకటికి రెండు ఆయుధాలు చేతికి ఇచ్చినట్లు అయిందని అంటున్నారు.

  చదవండి:రాజీనామా: 'ఫలించని జగన్ వ్యూహం, సెల్ఫ్ గోల్', బీజేపీపై బాబు కీలక వ్యాఖ్యలు

  ఆదినారాయణతో పలు అంశాల్లో క్లారిటీ

  ఆదినారాయణతో పలు అంశాల్లో క్లారిటీ

  బీజేపీ న్యాయం చేయకుంటే చంద్రబాబు రేపో మాపో తెగదెంపులు చేసుకుంటారని ఏపీ ప్రజలు భావించారు. కానీ ఆదినారాయణ 'ఆవేశం' నేపథ్యంలో టీడీపీ మాత్రం బీజేపీని వదిలే ఉద్దేశ్యం లేదని అర్థమవుతోందని అంటున్నారు. తాము బయటకు వస్తే జగన్ ఎక్కడ ఎన్డీయేలో చేరుతారోననే భయం కనిపిస్తోందని అంటున్నారు.

  సుజన వంటి వారు చెప్పిందే కానీ

  సుజన వంటి వారు చెప్పిందే కానీ

  తాము మార్చి 5 వరకు వేచి చూస్తామని, అప్పటికీ కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకుంటే తాము తీవ్ర నిర్ణయం తీసుకుంటామని గతంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి నుంచి ఎంపీ వరకు ప్రకటించారు. ఆదినారాయణ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి తమ పార్టీ కేంద్రమంత్రులు (సుజనా, అశోక్ గజపతి రాజు) రాజీనామా చేస్తారని చెప్పారు. నిన్న ఇతర టీడీపీ నేతలు చెప్పిన దానికి, ఆదినారాయణ చెప్పిన దానికి పెద్దగా తేడా లేదని అంటున్నారు.

  చదవండి:ట్విస్ట్, రాజీనామాలు అంతా తూచ్! ఆదినారాయణ రెడ్డి ఆవేశం: టీడీపీ, అవును... ఆది

  జగన్ చెప్పిన వెంటనే

  జగన్ చెప్పిన వెంటనే

  అయితే, ఏపీకి హోదా కోసం తమ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని, చంద్రబాబు తమతో కలిసి రావాలని జగన్ సూచించిన మరుక్షణమే ఆదినారాయణ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని చెప్పడం సై అంటే సై అన్నట్లుగా మారింది. దీంతో ఇది హైలెట్ అయింది.

  ఆదినారాయణ యూటర్న్, ఇరకాటంలో టీడీపీ

  ఆదినారాయణ యూటర్న్, ఇరకాటంలో టీడీపీ

  జగన్ కంటే నెల ముందే తమ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని చెప్పిన.. ఆ తర్వాత కాసేపటికే యూ టర్న్ తీసుకున్నారు. అది పార్టీ అభిప్రాయం కాదని, సొంత అభిప్రాయమన్నారు. అయితే అప్పటికే ఆలస్యమైందని అంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజీనామా చేస్తామన్న జగన్ ప్రకటన (ఏడాది ముందు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు రావు కాబట్టి), విజయసాయి రెడ్డి రాజీనామా చేయరన్న వైసీపీ నేతల వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగించాయని అంటున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పటి నుంచి టీడీపీదే పైచేయిగా కనిపిస్తోంది. కానీ ఆదినారాయణ రెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా టీడీపీ ఇరకాటంలో పడిందని అంటున్నారు.

  చదవండి:బీజేపీకి వార్నింగ్.. గంటలో ఏం జరిగింది? ఆది సంచలనం: చంద్రబాబు అసహనం?

  టీడీపీ నేతల ఆందోళన

  టీడీపీ నేతల ఆందోళన

  ఇప్పుడు దీంతోనే వైసీపీ టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. కేబినెట్ మంత్రే ఇరుకున పడేశారని అంటున్నారు. పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telugu Desam party irked with Minister and Telugudesam Party leader Adinarayana Reddy comments on resignations.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి