ఆయన అలా చేయడం బాధించింది: పవన్ కళ్యాణ్‌పై టీడీపీ, 'జగన్! జైట్లీ చెప్పాడనే'

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిధుల విషయంలో వాస్తవాలు తెలుసుకోవాలనుకోవడంలో తప్పు లేదని, ఆయన ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను కోరుకుంటున్నారని మంత్రి అచ్చెన్నాయుడు గురువారం అన్నారు.

చదవండి: బాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయం

అయితే, తన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలోకి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడం తనను బాధించిందని చెప్పారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికి కారణమైన ఆ పార్టీయే కారణమని పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని అడగడం సరికాదన్నారు.

చదవండి: జగన్ పిల్లవాడు, బెంగళూరులో హీరోయిన్స్‌తో విలాసాల్లో: టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్, పవన్ కమిటీతో భయం

పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి

పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి

ఏపీలో ఈ దుస్థితికి కాంగ్రెస్ పార్టీ నేతలు కారణమని పవన్ కళ్యాణ్ గుర్తించాలని అచ్చెన్నాయుడు చెప్పారు. కాపు రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అభ్యంతరాలు తెలిపిందని ఆయన చెప్పారు. దీనిపై కాపు నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కాపు రిజర్వేషన్లపై ఆందోళన వద్దు

కాపు రిజర్వేషన్లపై ఆందోళన వద్దు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారులు వివరణ అడిగారని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఎలా సాధ్యమో స్పష్టం చేయాలని అడిగారని చెప్పారు. తాము అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తామని చెప్పారు. షెడ్యూల్ 9లో చేర్చి చట్టం అమలు చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నామన్నారు.

జగన్! బాబు అందుకే అంగీకరించారు

జగన్! బాబు అందుకే అంగీకరించారు

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేసుల కోసం చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారని వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు. ఆ రోజు అరుణ్ జైట్లీ పార్లమెంటులో హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామని చెప్పారని, అందుకే చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. జగన్ దీనిని తెలుసుకోవాలన్నారు.

జగన్‌లా చిప్పకూడు తినిరాలేదు

జగన్‌లా చిప్పకూడు తినిరాలేదు

చంద్రబాబు కేంద్రంతో రాజీపడాల్సిన పని లేదని, రాష్ట్ర అభివృద్ధే తమకు ముఖ్యమని చెప్పారు. జగన్‌లా మేం కేసుల కోసం రాజీపడాలా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఏమైనా కేసులు ఉన్నాయా, ఆయన ఏమైనా జైలుకు వెళ్లి వచ్చారా అని నిలదీశారు. జగన్‌లా చిప్పకూడు తిని రాలేదన్నారు. అలాంటప్పుడు బాబు ఎందుకు రాజీపడతారన్నారు.

నాటకం ప్రజలకు అర్థమైంది

నాటకం ప్రజలకు అర్థమైంది

తెలుగువాడి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారని వర్ల రామయ్య చెప్పారు. తెలుగువాడి ఆత్మగౌరవానికి ఎక్కడైనా భంగం వాటిల్లితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమన్నారు. తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారని, అదొక తూతూ మంత్రం రాజీనామా అన్నారు. జగన్ ఆడుతున్న నాటకం ప్రజలకు అర్థమైందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam party leader and Ministr Atchannaidu on Thursday suggested Jana Sena chief Pawan Kalyan to know about Congress Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి