రెడ్డిగా పుట్టి కడప పరువు తీస్తున్నాడు, వీధిరౌడి పనికిరాడు: జగన్‌పై ఆదినారాయణ
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిపై మంత్రి ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏ1, ఏ2 కేటుగాళ్లు అంటూ వారిద్దరిపై ధ్వజమెత్తారు. జగన్ కడప జిల్లాలో రెడ్డిగా పుట్టి జిల్లా పరువు తీస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ వీధిరౌడీలా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన రాజకీయాలకు ఏమాత్రం పనికి రారని చెప్పారు.

జగన్, విజయసాయిలను చూసి చీదరించుకుంటున్నారు
జగన్ విజయసాయి రెడ్డిలను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అక్రమ సంపాదనతో విజయసాయి కళ్లు నెత్తికెక్కాయన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా పేరుతో నాటకాలు ఆడుతున్నారన్నారు.
ఏపీలో రాజకీయంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా 2019లో ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబు నాయుడే ఉంటారని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. అమరావతి నిర్మాణానికి చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.












Click it and Unblock the Notifications