ప్రభాస్ ను చినజీయరు మాములుగా ఎత్తలేదుగా!!
తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయరుస్వామి హాజరైన విషయం తెలిసిందే. తన ప్రసంగంలో చినజీయరు ప్రభాస్ ను ఆకాశానికెత్తేశారు. ఆయన పూర్తి ప్రసంగం విన్నవారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మఠాధిపతులు, స్వామీజీలు, సన్యాసులు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటారు. అందులో జరిగే వేడుకలకు కూడా హాజరుకారు. అంత జాగ్రత్తగా నియమాలను పాటిస్తుంటారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా : కాలం మారింది.. అందుకనుగుణంగా స్వాములు, సన్యాసులు, స్వామీజీలు మారుతూ వస్తున్నారు. ఇప్పటికే సినిమాలకు, రాజకీయాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. నటులు వెళ్లి రాజకీయవేత్తలను కలవడం, వారు వీరిని, వీరు వారిని కొనియాడటం ప్రస్తుతం జరుగుతున్నదే. కొన్ని సందర్భాల్లో రాజకీయ నేతలకు నటులు దిశా నిర్దేశం చేస్తున్న సందర్భాలు కూడా సర్వసాధారణమయ్యాయి.

ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేశారు : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయరుస్వామికి రాజకీయ రంగంతో ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. అరుదైన సందర్భాల్లోనే రాజకీయవేత్తల వేడుకలకు హాజరువుతంటారు. తాజాగా ఆయన ఆదిపురుష్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో మెరిశారు. టీవీల్లో ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూస్తున్నవారు నోరెళ్లబెట్టారు. సినిమా ఫంక్షన్ లో స్వామీజీలేంటి స్వామీ? అంటూ వారిలోవారే ప్రశ్నించుకున్నారు. అంతేకాదు.. చినజీయరు తన ప్రసంగంలో ప్రభాస్ ను ఓ రేంజ్ లో ఆకాశానికెత్తేయడంపై అందరూ ఆశ్చర్యచకితులయ్యారు
చినజీయరు నోటివెంట వచ్చిన పలుకులు
* నిజమైన బాహుబలి రాముడు అని నిరూపించడానికే ఆదిపురుష్ వచ్చింది.
* ఇలాంటి కార్యక్రమాల్లో తమలాంటివారు పాల్గొనడం ఇదే మొదటిసారి.
* ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు.
* మనలో ఉన్న రాముణ్ని బయటకు తెచ్చే ప్రయత్నాన్ని ప్రభాస్ చేస్తున్నారు.
* లోకానికి ఇంతకంటే మహోపకారం ఉండదు.
* మంచి పని చేసే మహనీయులకు తన దీవెనలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
* మంచిపని చేసేవారికి వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉంటుంది.












Click it and Unblock the Notifications