తిరుమలలో అపచారం.. శ్రీవారి ఆలయంపై మళ్ళీ చక్కర్లు కొట్టిన విమానం!

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మన దేశంలోనే నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాడించిన తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో ఏది జరిగినా అందరికీ ఆసక్తి ఉంటుంది. ఎంతో ఖ్యాతి గడించిన తిరుమల శ్రీవారి ఆలయం పైన ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారుతుంది.

ఆలయం పైనుండి రాకపోకలు నిషిద్ధం
నేడు మరోమారు తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఇక ఈ ఘటన పైన భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం పైనుంచి రాకపోకలు నిషిద్ధమని, అలా ఆలయం పైనుంచి రాకపోగలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సూచించారు.

Aeroplane circled on tirumala srivari Temple again devotees in tension

కేంద్రానికి టీటీడీ ఫిర్యాదు.. కానీ పట్టింపేది
ఇక ఇదే విషయంపైన టిటిడి పలుమార్లు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆలయం పైన నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమాన రాకపోకలను నిషేధించాలని టిటిడి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే టీటీడీ ఎన్నిసార్లు ఈ వ్యవహారం పైన కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేంద్ర విమానా శాఖ పట్టించుకోకుండా అలసత్వం వహిస్తూనే ఉంది.

నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్
అయితే ఈ వ్యవహారంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కేంద్రం వ్యవహరిస్తుందని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తిరుమల శ్రీవారి ఆలయంపైన నో ఫ్లై జోన్ గా ప్రకటించి, శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపాడాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

కేంద్రం స్పందిస్తుందా?
మరి కేంద్ర పౌర, విమాన యాన శాఖా మంత్రిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు అయినా ఈ ఘటన పైన పట్టించుకుంటారా? తిరుమల పవిత్రత కాపాడేలా చూస్తారా? మరి ఈ వ్యవహారంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా? తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పైన విమానాలు చక్కర్లు కొట్టడం ఆగుతుందా? అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+