షాక్:34 ఏళ్ళ తర్వాత వైఎస్ కుటుంబానికి ఓటమి, కడప జిల్లాలో చరిత్ర సృష్టించిన టిడిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప:వైఎస్ఆర్ సిపి షాక్ తగిలింది. వైసిపి కంచుకోటను టిడిపి బద్దలు కొట్టింది. వైఎస్ కుటుబానికి చెందిన వైఎస్ వివేకానందరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.34 ఏళ్ళ తర్వాత తొలిసారిగా వైఎస్ కుటుంబం ఈ ఎన్నికల్లో ఓటమి పాలైంది.

కడప జిల్లా అంటే వైఎస్ కుటుంబానికి కంచుకొటగా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో ఉన్న కాలం నుండి తాను పోటీచేసిన పులివెందుల అసెంబ్లీ స్థానంతో పాటు కడప పార్లమెంట్ స్థానంలోనూ జిల్లాలోనూ కూడ పలు నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టును కొనసాగించేవారు.

after 34 years ys family member ys vivekanada reddy defeated in elections

అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఆయన తనయుడు ఏర్పాటు చేసిన వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడ అదే పట్టును జిల్లాలో కొనసాగించింది.అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి స్థానిక సంస్థల ఎన్నికలను టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓటమి అంచువరకు వెళ్ళి 7 వేల ఓట్లతో విజయం సాధించారు.అయితే ఏనాడు కూడ వైఎస్ కుటుంబం ఏ ఎన్నికల్లో కూడ ఓటమి సాధించలేదు.

వైసిపికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బతీసేందుకుగాను టిడిపి వ్యూహత్మకంగా వ్యవహరించింది.అయితే టిడిపి వ్యూహరచన సత్పలితాలను ఇచ్చింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఓటమిపాలయ్యారు. వైఎస్ కుటుంబం తొలిసారి ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. వైఎస్ ను ఓడించి బీటెక్ రవి చరిత్రను సృష్టించారు.34 ఏళ్ళ తర్వాత టిడిపి వైఎస్ కుటుంబాన్ని ఓడించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
after 34 years ys family member ys vivekanada reddy defeated in elections.tdp candidate ravindra won in kadapa local body mlc elections
Please Wait while comments are loading...