వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇక దోస్తీ దైవ నిర్ణయం': బాబూ! చూస్తూ ఊరుకుంటారా? బీజేపీకి జగన్ పార్టీ వంత

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ఇష్యూ బీజేపీ, టీడీపీ నేతల మధ్య వివాదం రేపుతోంది. ఆయా పార్టీల అధిష్టానం ఒకరి పట్ల మరొకరు సానుకూలంగా ఉన్నప్పటికీ నాయకులు మాత్రం ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, కేంద్రంతో అవసరమని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు.

చదవండి:</a> </strong><strong><a class=అడ్డగోలుగా వ్యవహరిస్తే జైలుకు: పోలవరంపై బీజేపీ వార్నింగ్, లేఖలో ఏముందంటే" title="చదవండి: అడ్డగోలుగా వ్యవహరిస్తే జైలుకు: పోలవరంపై బీజేపీ వార్నింగ్, లేఖలో ఏముందంటే" />చదవండి: అడ్డగోలుగా వ్యవహరిస్తే జైలుకు: పోలవరంపై బీజేపీ వార్నింగ్, లేఖలో ఏముందంటే

మరోవైపు బీజేపీ పెద్దలు మాట్లాడకపోయినప్పటికీ కొందరు బీజేపీ నేతలు టీడీపీ వైపు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు మాత్రం టీడీపీపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు వారించినా ఆ పార్టీ నేతలు కూడా కమలం పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీకి వైసీపీ నేతలు కూడా అండగా నిలబడుతున్నారు.

చదవండి: బాబు తగ్గారు, ఏపీని కబళించాలని చూస్తే: మోడీకి జేసీ హెచ్చరిక, 'జగన్ రాజీనామా చేయిస్తే అంతే'

చదవండి: పోలవరం ఎఫెక్ట్: జవాబు చెప్పుకోవాలి.. మోడీ దుమ్ముదులిపిన బాబు, ఆధారాలతో సహా లెక్కలు!

చంద్రబాబుకు తెలియకుండా జరగడం లేదు

చంద్రబాబుకు తెలియకుండా జరగడం లేదు

తాజాగా, బీజేపీ నేత సోము వీర్రాజు టీడీపీపై నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీని విమర్శిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండానే బీజేపీ నేతలను టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు.

టీడీపీతో పొత్తు దైవం నిర్ణయిస్తుంది

టీడీపీతో పొత్తు దైవం నిర్ణయిస్తుంది

బీజేపీపై బురదచల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని హితవు పలికారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని, అది దైవమే నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందన్నారు.

అవినీతి చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా

అవినీతి చేస్తుంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా

పోలవరం విషయంలో వైసీపీ నేతలు కూడా టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. పోలవరం కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు అని, దానిని చంద్రబాబు తీసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, ఇంత అవినీతికి పాల్పడుతుంటే కేంద్రం ఎలా చూస్తూ ఊరుకుంటుందని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం బొత్స సత్యనారాయణ అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు.

పోలవరం నెపం కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారా

పోలవరం నెపం కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారా

పోలవరం ప్రాజెక్టుపై వస్తోన్న అభ్యంతరాలపై వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణతో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శుక్రవారం హైదరాబాదులో భేటీ అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల క్రితమే అన్ని పనులూ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని అన్నారని, ఇప్పుడు మాట మార్చి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని ఓ నెపాన్ని కేంద్రం నెట్టాల‌ని చూస్తున్నారా? అని బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేంద్రంపై సాకు వేసి తప్పించుకోవద్దు, లైట్ తీసుకున్నారు

కేంద్రంపై సాకు వేసి తప్పించుకోవద్దు, లైట్ తీసుకున్నారు

ప్రతిపక్ష వైసీపీ అభివృద్ధికి అడ్డుపడుతోందని చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు. నిన్నటి నుంచి అసెంబ్లీలో మాట్లాడుతోన్న ధోర‌ణి చూస్తే పోల‌వ‌రం ప్రాజెక్టు ముందుకు క‌దులుతుందా? అన్న ఆందోళ‌న నెల‌కొంద‌న్నారు. విభ‌జ‌న అనంతరం ఏపీ న‌ష్ట‌పోయే ప‌రిస్థితులు ఉన్నాయని, టీడీపీ ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌తతో ప‌ని చేస్తోంద‌న్నారు. పోల‌వ‌రంపై జాప్య‌త‌ స‌హించ‌రాని విష‌యమ‌న్నారు. కేంద్రం మీద సాకులు చెప్పి త‌ప్పించుకోవ‌ద్దన్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టును చంద్ర‌బాబు లైట్ తీసుకున్నార‌న్నారు.

మీరే దగ్గరుండి నీరుగారుస్తున్నారు

మీరే దగ్గరుండి నీరుగారుస్తున్నారు

చంద్ర‌బాబు పోల‌వ‌రాన్ని దగ్గర ఉండి నీరుగారుస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు చేతులు ఎత్తేయడం ఎందుకని నిలదీశారు. పోల‌వ‌రం బాధ్య‌త తీసుకుంది చంద్ర‌బాబా? కాదా? అన్నారు. కేంద్రం ఉన్న‌ది మీ మిత్రులేనని గుర్తు చేశారు. సాకులు చెప్పి మ‌భ్యపెట్ట‌డం స‌రికాదన్నారు. వారం రోజుల ముందే పోల‌వ‌రం అయిపోతోంద‌ని భ్ర‌మ‌లు క‌లుగజేశారని ధ్వజమెత్తారు.

English summary
After Bharatiya Janata Party leaders, YSR Congress Party leaders targets Andhra Pradesh CM Nara Chandrababu Naidu over Polavaram Issue. They supported BJP leaders statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X