జోగి రమేశ్ కు మరో ఝలక్ ..! కుమారుడికీ పోలీసుల షాక్..?
ఏపీలో కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు వాంగ్మూలం ఆధారంగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు ఆయన కుమారుడు రాజీవ్ కు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జోగి రమేశ్ ను కల్తీ మద్యం కేసులో నిందితుడిగా చేర్చి పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించే క్రమంలో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనిపై ఇవాళ క్లారిటీ రానుంది.
కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్ ను పోలీసులు నిన్న ఉదయం అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడ భవానీపురం పీఎస్ కు తరలించి సుదీర్ఘంగా విచారించారు. నిన్న రాత్రి వరకూ విచారణ జరిపిన పోలీసులు.. ఆయన్ను వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా పోలీసులతో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్, ఇతర వైసీపీ శ్రేణులతో కలిసి వాగ్వాదానికి దిగారు. తన తండ్రిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ వాదనలు చేశారు.

నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జోగి రమేష్‌ను హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. అదే సమయంలో ఆయన కుమారుడు రాజీవ్ తనతో పాటు వచ్చిన వైసీపీ అనుచరులతో కలిపి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం మొదలైంది. చివరికి తోపులాట జరగడంతో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఆస్పత్రి అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు.
ఇప్పటికే కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేశ్ ను, ఆయన సోదరుడు జోగి రామును పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆస్పత్రి ధ్వంసం కేసులో రాజీవ్ పైనా కేసు నమోదు చేస్తే అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications