బుడ్డా చేరిక టీడీపీకి కలిసొచ్చిందా?: 8కి టీడీపీ, 6కు తగ్గిన వైసీపీ ఎమ్మెల్యేలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆ పార్టీకి చెందిన నేతలు అంటున్నారు. ముఖ్యంగా ఈ 'ఆపరేషన్ ఆకర్ష్' వల్ల కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బాగా బలపడిందని చెప్పుకుంటున్నారు.

తాజాగా కర్నూలు జిల్లాలో వైసీపీ టికెట్‌పై గెలిచిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరెడ్డి గురువారం టీడీపీలోకి చేరడం జిల్లా ముఖచిత్రాన్నే మార్చేసిందని జిల్లా నాయకులు అంటున్నారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ సంఖ్యాబలంతో సమానంగా తూగలేని టీడీపీ ఒక్కసారిగా ఆ పార్టీ కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీగా అవతరించింది.

వివరాల్లోకి వెళితే... గడచిన సాధారణ ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. కర్నూలు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి బాగా పట్టు ఉండటంతో వైయస్ జగన్‌కు చెందిన వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.

After joining budda rajashekar reddy in tdp got extra one more mla

టీడీపీ తరుపు నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తాజాగా టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' తొలుత కర్నూలు జిల్లాలోనే తెర లేచింది. వైసీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో పాటు ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇద్దరూ టీడీపీలో చేరారు.

ఆ తర్వాత కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు టీడీపీలో చేరినా కర్నూలు జిల్లాలో వైసీపీ బలంగానే ఉంది. అయితే ఆ తర్వాత ఆలారుకు చెందిన జయరాములు టీడీపీలో చేరగా, గురువారం బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

దీంతో జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే తగిలింది. వలసల నేపథ్యంలో టీడీపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వైసీపీ సంఖ్యాబలం 6కు తగ్గింది. అంతేకాదు ఇప్పటి వరకు కర్నూలు జిల్లా వైసీపీ కన్వీనర్‌గా ఉన్న బుడ్డా రాజశేఖరరెడ్డి పార్టీ మారడంతో ఆ పార్టీ కొత్తగా జిల్లా కన్వీనర్‌ను నియమించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అంతేకాదు బుడ్డా చేరికతో జిల్లాలో బద్ధశత్రువులుగా ఉన్న భూమా, శిల్పాలు సైతం మాటా మాటా కలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీలోకి బుడ్డా చేరిక కర్నూలు జిల్లా టీడీపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+