Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇడుపులపాయలో సీఎం జగన్ -షర్మిల : అందరి చూపు అటే-విజయమ్మ మీటింగ్ కు వారంతా..!!

సెప్టెంబర్ 2, వైఎస్సార్ వర్దంతి. దీంతో, తన తండ్రికి నివాళి అర్పించేందుకు సీఎం జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. అదే విధంగా సోదరి..వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తల్లి విజయమ్మతో కలిసి కడప విమానాశ్రయం చేరారు. అక్కడి నుంచి ఇడుపుల పాయ కు చేరుకున్నారు. అటు జగన్- ఇటు షర్మిల ఇడుపులపాయకు వేర్వేరు సమయాల్లో చేరుకున్నా..ఇద్దరూ ఒకే కార్యక్రమం కసం..ఒకే చోటకు చేరారు. అయితే, ఇద్దరూ ఇడుపులపాయలోనే ఉన్నా..వేర్వేరు గెస్ట్ హౌసుల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.

జగన్ - షర్మిల ఇద్దరూ ఇడుపులపాయలో..

జగన్ - షర్మిల ఇద్దరూ ఇడుపులపాయలో..

గురువారం ఉదయం 9.30కి గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి 9.30 నుంచి 10.05 వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని దివంగత మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారు. 10.15 నుంచి పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. 11 గంటలకు బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో 11.30కు బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. 12.45కు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు. షర్మిల, విజయలక్ష్మి కూడా రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కు నివాళులు అర్పించనున్నారు.

కలిసే నివాళి అర్పిస్తారా..

కలిసే నివాళి అర్పిస్తారా..

జూలై 8న వైఎస్సార్ జన్మదినం నాడు ఇద్దరూ ఒకే చోటకు వచ్చే సమయం ఒకటే కావటంతో..ఆ రోజు సీఎం జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నారు. కానీ, ఇప్పుడు ఇద్దరూ ఇడుపులపాయలోనే ఉన్నా..వేర్వేరు భవనాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తండ్రి వర్దంతి నాడు కుటుంబ సభ్యులు అందరూ కలిసే నివాళి అర్పిస్తారా..లేక, సీఎం జగన్ నివాళి అర్పించటం ముగిసిన తరువాత షర్మిల వస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, జగన్ కుటుంబ సభ్యులతో కలిసే తన తండ్రికి నివాళి అర్పిస్తారని చెబుతున్నారు.

300 మందికి విజయమ్మ ఆహ్వానాలు..

300 మందికి విజయమ్మ ఆహ్వానాలు..

అదే విధంగా రేపు సాయంత్రం హైదరాబాద్ లో విజయమ్మ నాడు వైఎస్ తో ఆత్మీయంగా వ్యవహరించిన వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. దాదాపు 300 మందిని ఈ సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల సైతం ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కానున్నారు. వైఎస్సార్ తో సన్నిహితంగా మెలిగిన వారికి అందరికీ.. విజయమ్మ ఆహ్వాన పత్రికలు పంపటంతో పాటుగా మరి కొందరికి వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. రాజకీయ ప్రముఖులతో పాటుగా సినీ ప్రముఖులను సైతం ఆహ్వానించారు.

ఏపీ నుంచి హాజరయ్యేదెవరు...

ఏపీ నుంచి హాజరయ్యేదెవరు...

ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరు కావటం లేదని సమాచారం. మొత్తం ఆహ్వాన ఏర్పాట్లను నాడు వైఎస్సార్ వద్ద అదనపు పీఎస్ గా వ్యవహరించిన భాస్కర శర్మ పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అప్పాయింట్ మెంట్లు ఆయనే చూసేవారు. ఇప్పుడు వివిధ పార్టీల్లో వారంతా ఉండటంతో..విజయమ్మ స్వయంగా వారిని ఆహ్వానించారు. అయితే, నాడు వైఎస్సార్ తో ఉండి..నేడు టీఆర్ఎస్ లో ఉన్న నేతలు రేపు ఢిల్లీలో జరిగే తెలంగాణ భవన్ శంకుస్థాపన కార్యక్రమం కోసం వెళ్లారు.

సినీ ప్రముఖులకు విజయమ్మ ఆహ్వానం..

సినీ ప్రముఖులకు విజయమ్మ ఆహ్వానం..

అదే విధంగా ఏపీలో ప్రస్తుతం మంత్రులు - సీనియర్ నేతలుగా ఉన్న వారు జగన్ తో పాటు ఉన్నారు. వారిలో ఎవరు వస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇక, ఎంఐఎం అధినేతకు సైతం విజయమ్మ ఆహ్వానం పంపగా ..ఆయన ఇతర కార్యక్రమాల వలన రాలేనని..తనకు వైఎస్సార్ అంటే గౌరవం ఉందంటూ ఫోన్ చేసి చెప్పినట్లుగా సమాచారం. ఇక, సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, మోహన్ బాబు, సూపర్ స్టార్ క్రిష్ణ, జయసుధ, రాజశేఖర్-జీవిత దంపతులు వంటి వారిని సైతం ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి.
దీంతో..విజయమ్మ సమావేశానికి హాజరయ్యేది ఎవరు..విజయమ్మ ఈ సమావేశం లో చెప్పబోతున్నారు..ఏపీ నుంచి ఎవరు పాల్గొంటారు అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+