వివాహమైనా ప్రియుడితో ప్రేమాయణం:చేయని తప్పుకు శిక్షను అనుభవించిన భర్త

శ్రీకాకుళం :కాలేజీలో సీనియర్ తో ప్రేమలో పడింది ఓ యువతి. తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం చేశారు. వివాహం జరిగినా కాని ఆమె ప్రియుడితో ప్రేమాయణం కొనసాగించింది. కొన్నాళ్ళకు తనను కాదని మరోక యువతితో ప్రేమికుడు వివాహానికి సిద్దం కావడంతో ఆ యువతి ఆత్మహాత్య చేసుకొంది. ఎలాంటి తప్పు చేయకపోయినా భర్త శిక్షను అనుభవించాడు. తన భార్య మరణానికి గల కారణాలను బయటపెట్టాడు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు వెంకట్ జగదీష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా బెంగుళూర్ లో పనిచేస్తున్నాడు. అయితే జగదీష్ అదే జిల్లాకు చెందిన జోత్స్న వైశ్యరాజుతో 2015 మార్చిలో వివాహమైంది.వివాహం తర్వాత బెంగుళూర్ కు మకాం మార్చాడు జగదీష్ఇంజనీరింగ్ వరకు చదివిన జోత్న్స ఇంట్లోనే ఉండేది. ఉద్యోగం చేయడం ఇష్టం లేదని భార్య చెప్పడంతో భర్త కూడ అంగీకరించాడు.

వివాహం జరిగిన కొంత కాలం వరకు వారి మద్య ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే అదే ఏడాది డిసెంబర్ లో జోత్న్స ఆత్మహాత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహాత్యకు పాల్పడడంతో జోత్న్స తల్లిదండ్రులు జగదీష్ ను అనుమానించారు. ఆయన కారణంగా తమ కూతురు మరణించిందని పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు జగదీష్ ను అరెస్టు చేశారు. జగదీష్ కు కూడ జోత్స్న మరణం ఊహించని షాక్. అయితే తన భార్య మరణానికి గల కారణాలను తెలుసుకోవాలని భావించాడు జగదీష్.

after marrage continues affair with lover. husband reveal this secret

భార్య మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చిన జగదీష్

భార్య మరణానికి కారణంగా జైలు శిక్షను అనుభవించిన జగదీష్ బెయిల్ పై విడుదలై వచ్చారు. అయితే చేయన తప్పుకు శిక్షను అనుభవించానని తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఆమె ఆత్మహాత్యకు గల కారణాలను తెలుసుకోవాలని భావించాడు .వెంటనే పరిశోధన ప్రారంభించాడు. అతని ప్రయత్నం పలించింది. ప్రేమ వ్యవహారం కారణంగానే జోత్స్న మరణించిందని ఆధారాలతో సహా ఆయన రుజువు చేశాడు.

జోత్స్న వాట్సాప్ , ఫోన్ , ఫేస్ బుక్ లలో సమాచాాన్ని సేకరించాడు. ఈ సమాచారం ఆధారంగా కాలేజీలో ఆమెకు సీనియర్ తో ప్రేమ వ్యవహారం ఉందని తేటతెల్లమైంది. ఈ ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె చనిపోయిందని జగదీష్ గుర్తించాడు. కాలేజీలో తన సీనియర్ గిరిష్ పట్నాయక్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని ఆయన గుర్తించాడు. తనతో వివాహమైన తర్వాత కూడ ఈ వ్యవహారాన్ని కొనసాగించింది.ఒకానొక దశలో ఇద్దరు ఎటైనా పారిిపోదామని కూడ భావించారు. తాను ఆపీసుకు వెళ్ళిన తర్వాత గిరీష్ తో ఆమె ఎక్కువ చాట్ చేసేదని గుర్తించాడు. ఈ క్రమంలోనే మరో యువతితో వివాహానికి గిరీష్ పట్నాయక్ సిద్దమయ్యాడని తెలుసుకొని ఆమె ఆత్మహాత్యకు పాల్పడింది.ఈ ఆధారాలను జగదీష్ పోలీసులకు అందించాడు. వీటి ఆధారంగా పోలీసులు గిరీష్ ను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+