ఆ ధైర్యంతో బాబు హామీ, నమ్ముకోలేనని శిల్పా: వైసిపిలో చేరడం ఖాయమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలలో టిడిపి అభ్యర్థిపై చిక్కుముడి ఇంకా వీడలేదు. టిక్కెట్ తనకు ఇవ్వాల్సిందేనని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. అవసరమైతే వైసిపిలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకు ఆయన భయాలు ఆయనకు ఉన్నాయని అంటున్నారు.

వైసిపిలోకి శిల్పా, రంగంలోకి చంద్రబాబు?: జగన్ పార్టీలో రూట్ క్లియర్

ఇప్పుడు కనుక తాను భూమా కుటుంబ సభ్యులకు నియోజకవర్గాన్ని వదిలేస్తే 2019లో తనకు టిక్కెట్ వచ్చే అవకాశమే ఉండదని ఆయన అనుచరులతో చెబుతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు వదిలేస్తే 2019లో ఎంపీ, నంద్యాల ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

టిక్కెట్ వదిలేస్తే..

టిక్కెట్ వదిలేస్తే..

కానీ దానికి శిల్పా మోహన్ రెడ్డి ససేమీరా అంటున్నారు. ఇప్పుడు కనుక టిక్కెట్ వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో తనకు ఇబ్బందికర పరిస్థితి తప్పదని అనుచరులతో వాపోతున్నారని తెలుస్తోంది.

దానిపై చంద్రబాబు ఆశ... ఆశలు లేవని శిల్పా

దానిపై చంద్రబాబు ఆశ... ఆశలు లేవని శిల్పా

2019 ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, అప్పటికి సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అదే విషయాన్ని శిల్పా మోహన్ రెడ్డికి చెప్పారు. అయితే, నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకోలేమని, దానిని నమ్ముకోలేమని శిల్పా మోహన్ రెడ్డి అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎదుట కూడా కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది.

వారికి మంత్రి పదవి, నాకు టిక్కెట్

వారికి మంత్రి పదవి, నాకు టిక్కెట్

భూమా కుటుంబానికి హామీ మేరకు మంత్రిపదవి ఇచ్చారని, కాబట్టి నంద్యాల టిక్కెట్‌ తనకే ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు టిక్కెట్‌ ఇవ్వకపోతే, వచ్చే ఎన్నికల్లోను తనకు టిక్కెట్‌ కష్టమవుతుందని, రాజకీయంగా తన మనుగడకు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం తప్పనిసరని శిల్పా తెలిపారు.

టిడిపిని వీడటం ఖాయమైందా?

టిడిపిని వీడటం ఖాయమైందా?

నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉందని, దాన్నిబట్టి తాము నిర్ణయం తీసుకుంటామని శిల్పా మోహన్ రెడ్డి అంటున్నారు. అయితే, ఇప్పటికే భూమా అఖిల ప్రియకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తామని తేల్చి చెప్పినందున.. శిల్పకు ఆ ఛాన్స్ లేదని, కాబట్టి ఆయన టిడిపిని వీడయం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.

శిల్పా వర్సెస్ భూమా

శిల్పా వర్సెస్ భూమా

కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ స్థానం ఉప ఎన్నిక టిక్కెట్‌ వ్యవహారం జటిలంగా మారుతున్న విషయం తెలిసిందే. టిక్కెట్‌ తమకే ఇవ్వాలని భూమా, శిల్పా వర్గాలు పట్టుబడుతున్నాయి. తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని అఖిల ప్రకటించకా, తాను పోటీ చేస్తానని శిల్పా చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Telugudesam Party senior leader Silpa Mohan Reddy may join YSR Congress Party soon.
Please Wait while comments are loading...