పీఆర్సీపై రాని స్పష్టత-ఉద్యోగుల్ని చర్చలకు పిలిచిన జగన్ సర్కార్-నేడు కీలక ప్రకటన
ఏపీలో ఉద్యోగుల వేతన సవరణ నివేదిక నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పీఆర్సీ నివేదిక కోసం రోజూ సచివాలయం చుట్టూ తిరుగుతున్న ఉధ్యోగులు నిన్న ఏకంగా అక్కడే బైఠాయించారు. పీఆర్సీ నివేదికపై తేలిస్తేనే ఇళ్లకు వెళ్లామని తేల్చిచెప్పారు. దీంతో సీఎం జగన్ వద్దకు సీఎస్ సమీర్ శర్మ పరుగులు తీశారు. అయితే రాత్రివరకూ ఏమీ తేలలేదు. అదే సమయంలో ఈ నెలాఖరుకు పీఆర్సీ వ్యవహారం తేలుస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. దీంతో ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.
పీఆర్సీ నివేదిక ఇంత ఆలస్యమైతే ఇక పీఆర్సీ అమలు ఎప్పుడంటూ ఉద్యోగులు నిరసనలకు దిగుతున్నారు. నిన్న సచివాలయంలో ఉద్యోగుల నిరసన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా అమరావతి జేఏసీ నుంచి బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాసరావు ప్రభుత్వంపై పీఆర్సీ నివేదిక కోసం ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ సమీర్ శర్మతో భేటీ అయి తాజా అంశాలపై చర్చించే అవకాశముంది.

ఉద్యోగ సంఘాల నేతల్ని ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సచివాలయంలో చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. దీంతో వీరు ఇవాళ జీఏడీ సర్వీసెస్ సెక్రటరీని కలిసి ప్రభుత్వ వాదనను తెలుసుకునే అవకాసముంది. అలాగే డిమాండ్లను కూడా ఆయన ముందుంచే అవకాశముంది.

Recommended Video
దీంతో ప్రభుత్వం.. ఉద్యోగసంఘాల్ని ఈ నెలాఖరు వరకూ ఆగమని కోరే అవకాశముంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి. ఇతరత్రా ఆంశాల్ని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని కోరబోతున్నారు. అయితే ఉద్యోగులు ఓవైపు ఒకటో తేదీ జీతాలపై కూడా హామీ ఇవ్వలేని పరిస్ధితుల్లో ప్రభుత్వం ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పీఆర్సీ వ్యవహారాన్ని తేల్చకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications