కుప్పంలో చంద్రబాబు కోరుకున్నట్లే ! కనిపించని భరత్- మౌనంగా పెద్దిరెడ్డి- టీడీపీ ప్లాన్ సక్సెస్ ?
ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గిన తర్వాత స్ధానిక ఎన్నికల్లో వరుసగా టీడీపీని ఓడించి ఆయన పనైపోయిందంటూ ప్రచారం చేస్తున్న వైసీపీకి రెండు రోజులుగా అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు టూర్ సందర్భంగా నెలకొన్న పరిస్ధితులే.
Recommended Video

కుప్పంలో చంద్రబాబు టూర్
తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనకు ఇక్కడికి వచ్చిన చంద్రబాబుకు తొలి రోజు నుంచే వైసీపీ శ్రేణులు అడ్డుతగులుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబుకు సొంత నియోజవర్గంలో ఎదురవుతున్న ప్రతిఘటన చూసి అక్కడ చంద్రబాబు పనైపోయిందని అంతా భావించాలనేది వైసీపీ ఆలోచన. కానీ పరిస్ధితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో వచ్చి కనిపించి వెళ్లిపోయే చంద్రబాబును గెలిపిస్తూ వస్తున్న కుప్పం ప్రజల్లో ఓ రకమైన నిర్లిప్తత నెలకొంది. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబు ఈసారి చెక్ పెట్టారు.

వైసీపీ దాడులతో సీన్ రివర్స్
కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును సొంత నియోజకవర్గంలోనే అడ్డుకుంటే ఆయన రాకుండా పారిపోతారని వైసీపీ అనుకుందో ఏమో కానీ ఈసారి టూర్ లో మాత్రం అడుగడుగునా అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు చించేసి మరీ అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నించడం, చంద్రబాబు రోడ్ షోలో వైసీపీ జెండాలు ప్రదర్శించి రెచ్చగొట్టడం, ఆ తర్వాత చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడం వంటి చర్యలతో ఈసారి వైసీపీ అభాసు పాలైంది. దీంతో చంద్రబాబుకు అన్ని అవకాశాలు అప్పగించేసింది. వైసీపీ మౌనంగా ఉంటే చంద్రబాబు టూర్ ను ఎవరూ పట్టించుకునే వారు కాదన్న వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

వాడేసుకున్న చంద్రబాబు
కుప్పంలో నాలుగు దశాబ్దాలుగా తనను గెలిపిస్తూ వస్తున్న జనంలో నిర్లిప్తత పెరిగింది. దీనికి తోడు వైసీపీ ప్రలోభాలు కూడా కలిసి స్ధానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. దీంతో రేపు చంద్రబాబును కూడా ఓడిస్తామంటూ వైసీపీ ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టింది. నియోజకవర్గానికి చంద్రబాబు రానేరారంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీంతో స్ధానికుల్లో వ్యతిరేకత పెరుగుతందని భావించిన చంద్రబాబు.. ఈసారి మూడు రోజుల టూర్ కు వచ్చారు. దీన్ని సహించలేక వైసీపీ దాడులకు దిగింది. వీటిని సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు జనంలోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. చివరికి వైసీపీ దాడుల అంశం అన్నిచోట్లో ఫోకస్ అయింది.

కనిపించని భరత్, పెద్దిరెడ్డి మౌనం
చంద్రబాబుపై గెలిస్తే మంత్రిపదవి ఇస్తానంటూ జగన్ హామీ ఇచ్చినప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీ, వచ్చే ఎన్నికల్లో కుప్పం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న భరత్ మాత్రం ఈ మూడు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. స్ధానికంగా వైసీపీ దాడులపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నా భరత్ మాత్రం ఇంట్లోనే ఉండిపోతున్నారు. అలాగే నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేసే ఆయన రాజకీయ ప్రత్యర్ధి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం కుప్పంలో పరిణామాలపై మౌనం వహిస్తున్నారు. కేవలం వైసీపీ శ్రేణుల్ని దాడులకు ఉసిగొల్పి వీరు మౌనంగా ఉండిపోయారన్న చర్చ స్ధానికంగా జరుగుతోంది. దీంతో ఇదంతా చంద్రబాబుకు ప్లస్ కావడమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి మళ్లీ ప్రాణం పోసిందన్న వాదన వినిపిస్తోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications